Connect with us

Cricket

Washington DC: ఉరకలేసిన యువ రక్తం @ GWTCS క్రికెట్ టోర్నమెంట్

Published

on

అంగరంగ వైభవంగా స్వర్ణోత్సవ సంబరాలకు సిద్దమైన బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (Greater Washington Telugu Cultural Sangam – GWTCS) వేడుకలలో భాగంగా.. వందలాది మంది యువ క్రికెట్ క్రీడాకారులు (Cricket Players) గత నెల రోజులుగా అమెరికా రాజధాని Washington DC ప్రాంతంలో సుమారు 20 జట్లుగా చేరి పోటీపడగా.. గత శుక్రవారం జరిగిన తుది పోటీలో యానిమల్ పార్క్ జట్టు విజయ సాధించింది.

Greater Washington Telugu Cultural Sangam (GWTCS) అధ్యక్షులు కృష్ణ లాం మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో అమెరికాలో క్రికెట్ క్రీడకు గణనీయంగా పెరుగుతన్న ఆదరణ గమనించి, పూర్తి స్థాయిలో ఈ పోటీలు నిర్వహించామని, నిర్వహణకు సహకరించిన రామ్ మైనేని మిత్ర బృందాన్ని కృష్ణ (Krishna Lam) ప్రత్యేకంగా అభినందించారు.

నెల రోజులుగా ప్రణాళిక ప్రకారం ప్రతి రోజూ కొన్ని జట్లకు మ్యాచ్ లు నిర్వహించారు. గెలిచిన విజేత జట్టుకూ, రన్నర్ జట్టుకూ ట్రోఫీలు (Trophies), మెడల్స్ (Medals) అందించారు. చిన్నారులు, క్రీడాకారులు, వారి కుటుంబ సభ్యులు, సంస్థ కార్యవర్గ సభ్యులు (GWTCS Executive Committee) .. అందరూ Cricket మ్యాచ్ ఆసాంతం వీక్షిస్తూ క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ సందడి చేసారు.

క్రీడా స్ఫూర్తి తో ఆడటం, గెలుపోటములను సమానంగా, ఒక అనుభవంగా స్వీకరిస్తూ.. జీవితంలో సైతం ముందుకు సాగాలని.. బాషా, కళా, సంస్కృతిని ప్రతిబింబించే సమున్నత వేదికగా.. జరగబోతున్న స్వర్ణోత్సవాలకు (Golden Jubilee Celebrations) ప్రతి తెలుగు వారు ఇంటిల్లి పాది విచ్చేసి.. ఒక కుటుంబ పండుగలా జరుపుకుందామని GWTCS (Greater Washington Telugu Cultural Sangam) అధ్యక్షులు కృష్ణ లాం (Krishna Lam) అన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected