Connect with us

Sports

స్వర్ణోత్సవ వేళ నిజ జీవిత పాఠాల వలే క్రీడా సంబరం @ Washington DC: Krishna Lam, GWTCS President

Published

on

అమెరికా రాజధాని వేదికగా జరగబోతున్న బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (Greater Washington Telugu Cultural Sangam – GWTCS) స్వర్ణోత్సవాల వేళ వందలాది మంది చిన్నారులు, మహిళలు, యువకులతో కూడిన క్రీడాభిషేకమే జరిగిందని GWTCS President కృష్ణ లాం (Krishna Lam) తెలిపారు.

స్వర్ణోత్సవ వేడుకల్లో (Golden Jubilee Celebrations) భాగంగా బాడ్మింటన్ (Badminton) క్రీడా విభాగంలో నిర్వహించిన సింగిల్స్, డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్ పోటీలలో వందలాది మంది ఔత్సాహిక చిన్నారులు, యువకులు పలు విభాగాలలో పాల్గొని రోజంతా సందడి చేశారు. ఉదయం 8 గంటలకే కోలాహలంగా ఆరంభమైన ఈ పోటీలు, సాయంత్రం 8 గంటల వరకూ నిర్వహించారు.

మూడు తరాల వారిని ఒక క్రీడా వేదికపై కి తీసుకొచ్చి, పోటీలు నిర్వహించిన క్రీడా విభాగం (GWTCS Sports Team) సభ్యులు సురేంద్ర ఓంకారం, దినకర్ చొప్పా, రాజేష్ కాసరనేని, విజయ భాస్కర్, శ్రీకాంత్, జగదీష్, ఈశ్వర్, భాను, గణేష్, గోపి లను కృష్ణ లాం ప్రత్యేకంగా అభినందించారు.

తెలుగు వారందరినీ సంఘటితం చేసే ఆలోచనకు 50 సంవత్సరాల స్వర్ణోత్సవం (Golden Jubilee Celebrations) ఒక చారిత్రక ఘట్టమని, ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా పాల్గొనాలని కృష్ణ (Krishna Lam) తెలిపారు. క్రీడలు చిన్నారుల, యువత జీవితంలో ముఖ్య భాగమని, గెలుపు ఓటమిని సమానంగా స్వీకరించే క్రీడా స్ఫూర్తి ఈ వయసునుండే అలవర్చుకోవాలని తానా (TANA) మాజీ అధ్యక్షులు సతీష్ వేమన (Satish Vemana) తెలిపారు.

విజేతలకు బహుమతులను GWTCS (Greater Washington Telugu Cultural Sangam) కార్యవర్గ సభ్యులు అందించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు, పాల్గొన్న వారికీ ఉదయం అల్పాహారం, భోజనం అలాగే సాయంత్రం టీ అందించారు. రోజంతా సరదాగా ఒక పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.

error: NRI2NRI.COM copyright content is protected