Connect with us

News

GWTCS & TANA @ Washington DC: రామోజీకి భారతరత్న ఇవ్వాలి

Published

on

Washington DC, June 8, 2024: అమెరికాలోని వాషింగ్టన్ డీసీ (Washington DC) లో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) మరియు తానా (TANA) సంయుక్తంగా ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Cherukuri Ramoji Rao) మృతిపట్ల నివాళులు అర్పించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షులు కృష్ణ లాం (Krishna Lam) మాట్లాడుతూ.. అక్షరాన్ని ఆయుధంగా మలిచి, సమాజాన్ని చైతన్యపరచి ప్రశ్నించే, పోరాడేతత్వాలను బోధించారు. ప్రతి అక్షరాన్ని ప్రజాపక్షం చేసి అరాచక, నిరంకుశ శక్తులపై అలుపెరుగని పోరాటం చేసి ఒక చారిత్రక విజయాన్ని అందించారని కొనియాడారు.

గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు (Mannava Subbarao) మాట్లాడుతూ.. అనేక రంగాల్లో చారిత్రక విజయాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచిన రామోజీరావు, ఎన్టీఆర్ (NTR) లకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని కోరారు. రాష్ట్ర రాజధాని అమరావతి (Amaravathi) పేరు పెట్టడం వెనుక ఆయన ప్రేరణ ఉంది.

అమరావతే రాజధాని అంటూ రైతులు చేపట్టిన ఉద్యమానికి తన కలాన్ని, గళాన్ని వినిపించి బాసటగా నిలిచారు. రామోజీ, అంబేద్కర్ (BR Ambedkar), ఎన్టీఆర్ విగ్రహాలను రాజధాని నడిబొడ్డులో పెట్టాలి, ఒక ప్రాంతానికి రామోజీరావు పేరు పెట్టాలని తీర్మానించారు.

తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ చింతా (Sateesh Chinta) మాట్లాడుతూ… రామోజీరావు తెలుగువారు కావటం మనందరికీ గర్వ కారణం. కాలుమోపిన ప్రతి రంగంలో ఆయన విజయ సూత్రం కృషి, క్రమశిక్షణతో కూడిన కార్యాచరణ అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని భాను మాగులూరి (Bhanu Maguluri) సమన్వయ పరిచారు.

శ్రద్ధాంజలి కార్యక్రమంలో సురేఖ చనుమోలు, శ్రీనివాస్ చావలి, రమాకాంత్ కోయ, సుధీర్ కొమ్మి, రవి అడుసుమిల్లి, సుశాంత్ మన్నే, ఉమాకాంత్, చక్రవర్తి పయ్యావుల, రమేష్ అవిర్నేని, వీర్రాజు, సీతారామారావు, రమేష్ గుత్తా, మురళి, ప్రభు తదితరులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected