Connect with us

Celebrations

గుడివాడ విజేత, అట్లాంటా అందరివాడు MLA రాము వెనిగండ్ల సంబరాలు అంబరాన్నంటిన వేళ

Published

on

2024 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ (NDA) కూటమి తరపున ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి అట్లాంటా ఎన్నారై రాము వెనిగండ్ల పోటీ చేసి 50 వేలకు పైగా మెజారిటీతో MLA గా ఘన విజయం సాధించిన సంగతి విదితమే.

గుడివాడ (Gudivada) ఎమ్మెల్యేగా రాము వెనిగండ్ల ఘన విజయం అనంతరం మొట్టమొదటిసారి అమెరికా విచ్చేసిన సందర్భంగా అట్లాంటా (Atlanta, Georgia) లో అంబరాన్నంటేలా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన మరియు బీజేపీ నాయకులు, అభిమానులు సుమారు 1000 మంది పాల్గొన్నారు.

జాన్స్ క్రీక్ (Johns Creek) లోని సంక్రాంతి రెస్టారెంట్ బాంక్వెట్ హాల్లో (Sankranti Restaurant Banquet Hall) ఆగస్ట్ 25, ఆదివారం సాయంత్రం శ్రీనివాస్ నిమ్మగడ్డ ఆధ్వర్యంలో రాము సంబరాలు అంటూ కోలాహలంగా సాగాయి. ఇంటి నుండి సుమారు 50 టెస్లా కారుల్లో ర్యాలీగా విచ్చేసిన రాముకి అట్లాంటా (Atlanta) వాసులు ఎదురువెళ్ళి ఘన స్వాగతం పలికారు.

రాము వెనిగండ్ల అందరినీ పలకరిస్తూ, కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. డప్పులతో ఊరేగింపుగా వేదిక ప్రాంగణానికి తోడ్కొని వెళ్లారు. వ్యాఖ్యాతలు సురేష్ పెద్ది (Suresh Peddi) మరియు సుజాత ఆలోకం (Sujatha Alokam) సభికులందరికీ స్వాగతం పలికి, ఆసీనులు గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎన్నారై టీడీపీ అట్లాంటా (NRI TDP Atlanta) నాయకులు శ్రీనివాస్ లావు, అంజయ్య చౌదరి లావు, సతీష్ ముసునూరి, మల్లిక్ మేదరమెట్ల, టీం జనసేన అట్లాంటా (Team Atlanta Janasena) నాయకులు సురేష్ ధూళిపూడి, సురేష్ కరోతు, మరియు భారతీయ జనతా పార్టీ (BJP) అట్లాంటా నాయకులు కార్తికేయ బండారు సభికులను ఉద్దేశించి ప్రసంగించారు.

అనంతరం ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) విగ్రహానికి పూలతో నివాళులర్పించి రాము వెనిగండ్ల మరియు వారి శ్రీమతి సుఖద వెనిగండ్ల వేదికనలంకరించారు. సుఖద వెనిగండ్ల (Sukhada Venigandla) కూడా తన అనుభవాలను, తన కళ్ళతో చూసిన గుడివాడ (Gudivada) వాసుల ఇబ్బందులను సభాముఖంగా తెలియజేసి, అందరూ సహాయం చేయాలని కోరారు.

గుడివాడ ఎమ్మెల్యే రాము వెనిగండ్ల మాట్లాడుతూ.. అట్లాంటా నాకు చాలా ఇచ్చింది. ఎలెక్షన్ కి ముందు, ఎలెక్షన్ ప్రాసెస్ లో, ఎలెక్షన్ తర్వాత ఇప్పుడు కూడా మీరు చూపుతున్న ప్రేమకి కృతఙ్ఞతలు అంటూ సుదీర్ఘంగా ప్రసంగించారు. అలాగే ప్రస్తుత గుడివాడ పరిస్థితులను వివరిస్తూ ఎన్నారైలు ఏ సహాయం కావాలన్నా, అభివృద్ధిలో భాగంగా పెట్టుబడులు పెట్టాలన్నా డైరెక్టుగా తనని సంప్రదించవచ్చని అన్నారు.

Q&A లో భాగంగా రాము మరియు సుఖద లను వ్యక్తిగత (Personal) మరియు రాజకీయ (Political) విషయాలపై వ్యాఖ్యాతలు అడిగిన ప్రశ్నలు, అలాగే వారిరువురూ చెప్పిన సమాధానాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మహిళలు, పెద్దలు ముందు ముందు రాము మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.

రాము వెనిగండ్ల, సుఖద వెనిగండ్ల కు శ్రీనివాస్ నిమ్మగడ్డ, కవిత నిమ్మగడ్డ పుష్పగుచ్ఛం అందజేయగా, రాజేష్ జంపాల మరియు సుజాత ఆలోకం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జై రాము, జై జై రాము, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై మోడీ అంటూ నినాదాలు చేశారు.

తదనంతరం పలువురు సభికులు అడిగిన ప్రశ్నలకు రాము (Ramu Venigandla) విపులంగా సమాధానాలిచ్చారు. కొంతమంది గుడివాడ (Gudivada) ప్రవాసులు, ఎన్నికల సమయంలో గుడివాడ లో కాంపెయిన్ చేసిన వారు తమ అనుభవాలను పంచుకున్నారు. వేదిక ప్రాంగణం అంతా ఆనందడోలికల్లో వెల్లివిరిసింది.

అందరి సమక్షంలో కరతాళ ధ్వనుల నడుమ విజయోత్సవ సంబరాల (Victory Celebrations) కేక్ కట్ చేసి అందరికీ పంచారు. అందరూ గుడివాడ స్టార్ MLA రాము వెనిగండ్లతో (Ramu Venigandla) ఫోటోలు దిగారు. మహిళలు సైతం కార్యక్రమం ఆసాంతం ఓపికగా ఉండి ఆలకించడం విశేషం.

ఈ కార్యక్రమానికి డీజే రాజ్ ఆడియో, రవికిరణ్ వడ్డమాను ఫోటోగ్రఫీ, అరవింద్ డ్రోన్ ఫోటోగ్రఫీ, శివ రామడుగు టీవీ 9 మరియు NRI2NRI.COM మీడియా సహకారం అందించారు. చివరిగా భోజనానంతరం వందన సమర్పణతో (Vote of Thanks) సంబరాలను ఘనంగా ముగించారు.

గుడివాడ విజేత, అట్లాంటా అందరివాడు MLA రాము వెనిగండ్ల సంబరాలు అంబరాన్నంటిన వేళకి సంబంధించి మరిన్ని ఫోటోల కోసం www.NRI2NRI.com/Gudivada MLA Ramu Venigandla Felicitation in Atlanta ని సందర్శించండి

error: NRI2NRI.COM copyright content is protected