Washington, D.C.: గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (Global Telangana Association – GTA) వాషింగ్టన్ డీసీ వారు సెప్టెంబర్ 28 ఆదివారం రోజున బ్రాడ్ రన్ హైస్కూల్ లో నిర్వహిస్తున్న సద్దుల బతుకమ్మ & దసరా సంబరాలు నభూథో న భవిష్యత్తు అనేలా అధిక సంఖ్యలో మహిళలు, పురుషులు మరియు పిల్లలు పాల్గొని వేడుకలను విజయవంతంగా జరిగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అందులో భాగంగా ప్రముఖ సంగీత దర్శకులు కోటి గారు (Koti), యూ ట్యూబ్ వీడియోల ద్వారా ప్రజాదరణ పొందిన గంగవ్వ గారు, సినీ నటి అనన్య నాగల్ల గారు, వర్జీనియా రాజకీయ నాయకులు Congressman Suhas Subramanyam, VA State Senate Kannan Srinivasan, Delegate JJ Singh, Secretary of Commerce and Trade for the Commonwealth of Virginia Juan Pablo Segura మరియు కొన్ని కమ్యూనిటీ ల లో కూడా GTA సద్దుల బతుకమ్మ & దసరా సంబరాల పోస్టర్ ఘనంగా ఆవిష్కరించుకొన్నాము.
GTA వాషింగ్టన్ డీసీ టీం అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.సుజిత (Sujitha) దర్శకత్వం లో మహిళలు జయ తేలుకుంట్ల, ప్రత్యూష నరపరాజు, మాధురి గట్టుపల్లి, లక్ష్మి బుయ్యాని, సంకీర్త ముక్క, సింధూర పల్రెడ్డి, మీన కలికోట, అనూష గుండ, గీత తోట, స్వరూప సింగిరేసు, చిన్ని మరియు ఇతర మహిళలు పాల్గొని టీజర్ షూట్ చేయడం మరియు లాంచ్ చేయడం జరిగింది.ప్రత్యూష నరపరాజు మరియు మాధురి గట్టుపల్లి వందన సమర్పణ తో కార్యక్రమము ముగించడం జరిగింది.
Global Telangana Association (GTA) Washington DC Mega Bathukamma and Dasara Sambaralu 2025 Teaser
వాషింగ్టన్ డీసీ GTA సద్దుల బతుకమ్మ & దసరా సంబరాల పోస్టర్ ఆవిష్కరణ లో పాల్గొన్న బతుకమ్మ (Bathukamma) కోర్ టీం అందరిదీ కూడా ఒకటే లక్ష్యం ..సెప్టెంబర్ 28 న ఆదివారం రోజున బ్రాడ్ రన్ హైస్కూల్ లో నిర్వహిస్తున్న సద్దుల బతుకమ్మ & దసరా సంబరాలు నభూథో న భవిష్యత్తు అనేలా అధిక సంఖ్యలో మహిళలు, పురుషులు
మరియు పిల్లలు పాల్గొని మంచి భోజనం చేసి కోళాటం జానపద నృత్యాల లో పాల్గొని బెస్ట్ బతుకమ్మ ల కు బంగారు బహుమతులు, గౌరి మరియు జమ్మి పూజ వేడుకలను విజయవంతంగా నిర్వహించాలి.ఇంకా రిజిస్టర్ చేయని వారు www.gtadcbathukamma.com రిజిస్టర్ చేసుకోగలరు.
గ్లోబల్ తెలంగాణా అసోసియేషన్ (GTA)సంస్థ చైర్మన్ విశ్వేశ్వర కలువల (Vishweshwar Kaluvvala), ఉపాధ్యక్షులు శ్రవణ్ పాడూరు, వాషింగ్టన్ డీసీ అధ్యక్షులు రాము ముండ్రాతి, పూర్వ అధ్యక్షులు తిరుమల్ మునుకుంట్ల, ట్రెజరర్ సుధీర్ ముద్దసాని, స్టాండింగ్ కమిటి చైర్ శ్రీకాంత్ పొట్టిగారి మరియు ఇంటెర్నేషనల్ కో-ఆర్డినేటర్ నర్సి దోమ, ఉపాధ్యక్షులు కోట్య బానోత్,
అలాగేవెంకట్ మందడి, రఘు తోట, హరి వేముల, క్రాంతి దూడం, రాజేష్ కాసారనేని, సందీప్ పునరెడ్డి, ప్రముఖ గీత రచయిత మరియు VR ట్యూన్స్ అధినేత వెంకట కృష్ణ రెడ్డి గుజ్జులా, సామ్ గుజ్జులా, మాల్గుడి వెజ్ అధినేత శివరాం, అమ్మ షార్ట్ ఫిలిం డైరెక్టర్ హరీష్ బన్నాయి ఇతర స్నేహితులు మరియు మహిళలు తో కలిసి వాషింగ్టన్ డీసీ GTA సద్దుల బతుకమ్మ & దసరా సంబరాల పోస్టర్ ఆవిష్కరణ లాంచ్ చేయడం జరిగింది.