రిచ్మండ్ డీప్ రన్ హై స్కూల్లో జనవరి 19న గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ (GRTA) సంక్రాంతి సంబరాలు సరదా సరదాగా జరిగాయి. ఈ వేడుకలలో 1400 మందికి పైగా తెలుగు వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో 40 మందికి పైగా మహిళలు విభిన్న ముగ్గులు వేసి అలరించారు. గెలిచిన వారికి రవి రియాలిటి రవి గుత్తా బహుమతులు అందజేశారు. పిల్లలకు ప్రత్యేకంగా భోగి పళ్ళు కార్యక్రమము నిర్వహించారు.
ఈ వేడుకలకు దక్షిణ భారత సంఘాల అధ్యక్షులు ముఖ్య అతిధులు గా విచ్చేసి తెలుగు వారికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసినారు. రిచ్మండ్ లోని పిల్లలు మరియు పెద్దలు ఆలపించిన భక్తి గేయాలు, పద్యాలు, టాలీవుడ్ మెడ్లీలు, నాటికలు, సినిమా పాటలు, కూచిపూడి నృత్యాలు, బ్రేక్ డాన్సులు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసాయి. ఈ వేడుకలకు పత్యేక ఆహ్వానితులుగా వచ్చిన మహిళా టీమ్స్ చేసిన డాన్సులు ఈ కార్యక్రమానికే హైలైట్. వారందరికీ ట్రోఫీ లను బహుకరించారు.
GRTA వారు అందించిన తిరుపతి శ్రీవారి ప్రసాదం, రుచికరమైన వంటకాలు, అరిసెలు, ఆత్రేయపురం పూతరేకులు, గుంటూరు గోంగూర, పండు మిరప పచ్చళ్ళు, ఉలవచారు షడ్రసోపేతంగా ఉన్నాయని పలువురు ప్రశంసించారు. ఆఖరి దాకా హాలు నిండి ఉండడం ఈ కార్యక్రమం ఎలా జరిగిందో తెలియజేస్తుంది. సోషల్ సర్వీస్ లో భాగంగా నిర్వహించిన క్లాత్ & టాయ్ డ్రైవ్ లో ఎన్నడూ లేనంత అత్యదికంగా బట్టలు, ఆట వస్తువులు సేకరించటమైనది. అధ్యక్షు లు శంకర్ మాకినేని మరియు కార్యవర్గం విచ్చేసి న అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసినారు.
చివరగా కనీవినీ ఎరుగని రీతిలో సంక్రాంతి సంబరాలని విజయవంతం చేసిన రిచ్మండ్ నగర వాసులకు, స్పాన్సర్స్ కి, ముఖ్య అతిధులకి, స్కూల్ యాజమాన్యానికి, అద్బుతంగ వీడియోలు తీసిన వెంకటేష్ గారికి, స్టేజ్ డెకరేషన్ చేసిన స్పెక్ట్రమ్ డెకార్స్ శ్రుతి, ఫోటోగ్రఫీ వాసు పిక్స్ శ్రీని యెల్లపు, భాను క్లిక్స్ భాను, ఫోటో బూత్ చేసిన డ్రీం క్రియేషన్స్, కళాకారులకి, వాలంటీర్స్, ఆడియొ సేవలు అందిచిన నవీన్ వలిపిరెడ్డి, వ్యాఖ్యాతలు మెహర్, జ్యోతి మరియు హసిత లకు సభాముఖంగా అధ్యక్షులు శంకర్ మాకినేని GRTA కార్యవర్గం తరఫున ధన్యవాదాలు తెలిపి సంక్రాంతి ఉత్సవాలను దిగ్విజయంగా ముగించారు.