Connect with us

Associations

విజయవంతంగా గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్‌ బతుకమ్మ మరియు దసరా సంబరాలు

Published

on

అక్టోబర్ 14న గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్‌ ‘జి.ఆర్.టి.ఏ’ ఆధ్వర్యంలో బతుకమ్మ మరియు దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. కలర్ఫుల్ బతుకమ్మలు, ఆడపడుచుల కోలాటం, నృత్యాలు మరియు నోరూరించే వంటలు ఇలా చాలా ప్రత్యేకతలున్నాయి. అసోసియేషన్‌ అధ్యక్షులు శంకర్ మాకినేని అధ్యక్షతన జరిగిన ఈ సంబరాలకు ఊహలకందని విధంగా తెలుగు వారు తరలి రావడం విశేషం. ఈ కార్యక్రమ విజయానికి సహాయపడిన జి.ఆర్.టి.ఏ తోటి కార్యనిర్వాహకవర్గం, సమర్పకులు ఎస్ బేస్ టెక్నాలజీస్ రాజ్ గొర్రె, ఇన్స్పిరిక్స్ టెక్నాలజీస్ వంశి మల్గిరెడ్డి, కిరణ్ చాడ, వెంకట్ వెనిగళ్ల, మారం రియాల్టీ బాల గట్ల, యునైటెడ్ రియాల్టీ రవి గుత్తా, చంద్ర రాగ్యారీ, ఎస్వీఎస్ విద్యామందిర్ ప్రేమ్, అద్నాన్ గ్రాసరీ, ఐపీహెచ్ శివ పిళ్ళై, మధు కొండ్రగుంట ఫొటోస్ & వీడియో, చిరు డీజే, స్పెక్ట్రమ్ డెకర్స్ ఫోటో బూత్, కోలాటం టీం సునీత, వర్జీనియా హిందూ టెంపుల్ కమిటీ , విపిన్ గౌతమ్, రాజ్ గడ్డం తదితరులకు అధ్యక్షులు శంకర్ మాకినేని ధన్యవాదాలు తెలియజేసారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected