Connect with us

Picnic

ఆగస్ట్ 20న ప్రకృతి ఒడిలో గేట్స్ వనభోజనాలు – GATeS

Published

on

గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (Greater Atlanta Telangana Society) అట్లాంటా మహానగరంలో సుమారుగా రెండు దశాబ్దాలకు పైగా తెలంగాణ సంస్కృతిని, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ మన సంస్కృతిని సామాజిక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో కృషి చేస్తున్నారు.

గేట్స్ (GATeS) వారి కార్యక్రమాల్లో భాగంగా ఈనెల ఆగష్టు 20వ తేదీ నాడు మన పల్లె భోజనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి గేట్స్ సభ్యులందరు కుటుంబ సమేతంగా విచ్చేసి గేట్స్ కార్యనిర్వాహక సభ్యులు అందిస్తున్న రుచికరమైన వనభోజనాన్ని, ఆటపాటలను మనస్ఫూర్తిగా ఆస్వాదించాలిసిందిగా కోరుతున్నారు.

ఎప్పుడు: ఆగస్టు 20, 2023, ఆదివారం
సమయం: మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5 వరకు
ఎక్కడ: Lake Lanier, 1200 Saddle Dike #3, Buford Dam Road, Buford, GA – 30318

రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రిజిస్ట్రేషన్ కొరకు www.NRI2NRI.com/GATeS Picnic 2023 ని సందర్శించండి. అలాగే హృదయపూర్వక స్నేహం కోసం www.NRI2NRI.com/GATeS Membership ని సందర్శించి గేట్స్ లో సభ్యులుగా చేరండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected