Connect with us

Cultural

ఆస్కార్ అవార్డ్ విజేత చంద్రబోస్ అతిథిగా జూన్ 10న గేట్స్ తెలంగాణ సాంస్కృతిక దినోత్సవం

Published

on

గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (GATeS) వారు ప్రతిష్ఠాత్మకంగా ప్రతి సంవత్సరం నిర్వహించే ‘తెలంగాణ సాంస్కృతిక దినోత్సవం’ జూన్ 10 శనివారం రోజున అట్లాంటా మహానగరంలో నిర్వహించబోతున్నారు. ఈ తెలంగాణ దినోత్సవ సంబరాలను మనతో కలిసి పంచుకోవడం కోసం ప్రముఖ గేయ రచయిత మరియు ఆస్కార్ అవార్డ్ విజేత చంద్రబోస్ ముఖ్య అతిథిగా వస్తున్నారు.

ఈ తెలంగాణ దినోత్సవం రోజు మీకోసం, మన అందరికోసం జానపద గేయాలు, సినిమా పాటలు, వివిధ కళా రూపాలు మరియు నృత్య ప్రదర్శనలు నిర్వహించబోతున్నారు. జానపద కళాకారులు, ప్రముఖ సినీ గాయకులు, అలాగే లోకల్ డాన్స్ అకాడమి వారు ప్రదర్శించే కళా రూపాలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకోనున్నాయి.

డులూత్ లోని గ్యాస్ సౌత్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన గేట్స్ సభ్యులు www.NRI2NRI.com/GATeSTCDay2023 లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవలెను. రిజిస్టర్ చేసిన వారికి మాత్రమే అనుమతి లభించును. గేట్స్ సభ్యులు కాని వారు గేట్స్ సభ్యత్వం తీసుకొని రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. లేదా ప్రవేశ రుసుము చెల్లించి రిజిస్టర్ చేసుకోవచ్చు.

2023 జూన్ 10 శనివారం మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు నిర్వహించే కార్యక్రమం గురించి వివిధ సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేయవలసిందిగా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణా సాంస్కృతిక కార్యక్రమ పండుగని విజయవంతం చేయచేయవల్సిందిగా హృదయపూర్వకముగా గేట్స్ కార్యవర్గం కోరుతున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected