Connect with us

Associations

గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ సలహా మండలి ఏర్పాటు: GATeS

Published

on

గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (Greater Atlanta Telangana Society – GATeS) 2023 సంవత్సరానికి జనార్ధన్ పన్నెల అధ్యక్షులుగా కార్యవర్గ సభ్యులు, శ్రీనివాస్ పర్సా బోర్డు ఛైర్మన్ గా బోర్డు సభ్యులు ఈ జనవరి నుండి ఛార్జ్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ వార్త కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ కి దశాబ్దానికి పైగా నిరంతరం సేవలను, సలహాలను, సూచనలను, ఆర్థికంగాను మద్దతు తెలుపుతూ గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ యొక్క సేవలను, సంస్కృతిని ఇటు జార్జియా (Georgia) రాష్ట్రంలోను అటు భారతదేశం (India) లోని గ్రామీణ ప్రాంతాలకు చేరేలా ఎంతో మంది కృషి చేస్తున్నారు.

వీరందరితో 2023 కి గాను సలహా మండలి (Advisory Committee) ని గౌరవపూర్వకంగా ఏర్పాటు చేశారు. గేట్స్ సేవలను ఎంతో మందికి చేరువయ్యేటట్టు మేము ఉన్నామంటూ భరోసా అందిస్తున్న ప్రతి సలహా మండలి సభ్యులకు గేట్స్ కార్యనిర్వాహక సభ్యులు మరియు బోర్డు సభ్యులు ప్రత్యేక ధన్యవాదములు తెలియచేశారు. భవిష్యత్తులో గేట్స్ చేపట్టే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ మీ నిరంతర మద్దతు ఎల్లప్పుడు అందిస్తారని ఆశిస్తున్నామన్నారు.

నిరంతర మద్దతు మరియు మార్గదర్శకత్వంతో గేట్స్ (GATeS) లక్ష్యాలను సాధించడంలో మరియు తెలంగాణ (Telangana) సమాజానికి సేవ చేయడంలో మీరు కీలకంగా ఉన్నారు. మీ నిరంతర మద్దతుకు మా కృతజ్ఞతలు అంటూ మన సమాజం యొక్క అభివృద్ధి కోసం కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాము అన్నారు.

గేట్స్ 2023 సలహా మండలి సభ్యులు:- డా. శ్రీని గంగసాని, డా. సతీష్ చీటి, ప్రభాకర్ బోయపల్లి, గౌతం గోలి, కరుణాకర్ అసిరెడ్డి, కిరణ్ పాశం, వెంకట్ వీరనేని, శ్రీజన్ జోగినపల్లి, శ్రీధర్ నెలవెల్లి, రతన్ ఎలుగుంటి, నంద చాట్ల, నరేందర్ రెడ్డి, శ్రీధర్ జూలపల్లి, అనిల్ బోదిరెడ్డి, తిరుమల్ పిట్ట.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected