ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వార్షిక పండుగ దసరా బతుకమ్మ సంబరాలను అక్టోబర్ 10 న గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (గేట్స్) ఆధ్వర్యం లో అట్లాంటాలోని యుగల్ కుంజ్ టెంపుల్లో ఘనంగా నిర్వహించారు. జీవో జీవస్య జీవనం అనగా మనం జీవిస్తూ నిస్సహాయ స్థితిలో ఉన్న మనుషులకు సహాయం చేసి వారిని కూడా జీవించేలా చేయడం అనే ధ్యేయం తో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సామాజిక సేవాకార్య క్రమాలు చేస్తున్నాం అని తెలుపుటకు సంతోషిస్తున్నాము. సేవాకార్యక్రమాలు చేస్తూనే భవిష్యత్ తరాలకు మన పండుగలు సంస్కృతి సంప్రదాయాలను అందించాలి అనే ఉద్దేశ్యంతో గత 16 సంవత్సరాలుగా దసరా బతుకమ్మ సంబరాలను గేట్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. పూలను పూజించే ప్రకృతి సంబంధమైన పండుగ బతుకమ్మ మరియు తెలంగాణలో అతి ముఖ్యమైన పండుగలలో ఒకటి.
తెలంగాణ సంస్కృతికి సంబందించిన బతుకమ్మ పాటలను పాడుతూ, చప్పట్లు కొడుతూ, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ, శబ్దాలకు అనుగుణంగా నృత్యం చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించారు. గేట్స్ EC, BOD టీమ్ మరియు లోకల్ ఆర్టిస్టులు అందరూ కలిసి ఎంతో శ్రద్ద తో చాలా చక్కటి పాటలను ఈ వేడుకకు సిద్దం చేసి ఎంతటి ఘనమైన ప్రాముఖ్యత ఈ బతుకమ్మ వేడుకకు కలదో తమ కళా నైపుణ్యం ద్వారా తెలియజేస్తూ తెలంగాణ ప్రకృతి పండుగకు బహుమానం ఇచ్చాం అనే విధంగా గా ఈ వేడుకలను నిర్వహించారు. గేట్స్ EC & BOD కిషన్ తాళ్ళ పల్లి ( అధ్యక్షులు), చిత్తరి పబ్బ ( చైర్మన్), సునీల్ గోతూర్ (ఉపాధ్యక్షులు), జనార్దన్ పన్నేళ ( జనరల్ సెక్రటరీ), శ్రీనివాస్ పర్శ (ట్రెజరీ), సందీప్ గుండ్ల ( కల్చరల్ సెక్రటరీ), చలపతి వెన్నమనేని (ఈవెంట్ సెక్రటరీ), ప్రభాకర్ మదుపతి (స్పోర్ట్స్ సెక్రటరీ), రామాచారి నక్కెర్టి(డైరెక్టర్), అనిత నెల్లుట్లా (డైరెక్టర్), నవీన్ బత్తిని ( డైరెక్టర్), గణేష్ కాసం (డైరెక్టర్), రమణ గండ్ర (డైరెక్టర్), కిర్తిధర్ గౌడ్ చెక్కిల (డైరెక్టర్), నవీన్ ఉజ్జిని (డైరెక్టర్) మరియు ఇతర కార్యవర్గ సభ్యుల వాలంటీర్స్ గేట్స్ Team-2021.
గేట్స్ సేవాకార్యక్రమాలు అమెరికాకే పరిమితం కాకుండా మాతృదేశంలో అనగా మన తెలంగాణలో కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం ప్రతి నెల ఫుడ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం, చలికాలము దుప్పట్లు బట్టలు పంచుతున్నం, స్పోర్ట్స్ నిర్వహిస్తున్నాం, హెల్ప్లైన్ ద్వారా సూచనలుసలహాలు ఇస్తున్నాం, స్కాలర్ షిప్ ప్రోగ్రామ్స్, యోగ క్లాసులు నిర్వహిస్తున్నాం, తెలంగాణ లో కోవిడ్ వల్ల ఇబ్బంది పడుతున్న వారికి అవసరమైన ఆహార సరుకులు అందజేస్తున్నము, అవేర్నెస్ సెమినార్లు నిర్వహిస్తున్నాం. ఆధునిక కాలంలో సంపాదనే ధ్యేయం గా జీవిస్తున్న ఈ సమాజం లో ఇలాంటి సేవాకార్యక్రమాల కొరకు సమయాన్ని, సంపాదన ను వినియోగిస్తూ మనతో పాటు మన తోటి వారు కూడా బాగుండాలి అనే ఉద్దేశ్యంతో పని చేస్తున్న గేట్స్ సంస్థ కు, ప్రతి సభ్యునికి శత కోటి ప్రణామాలు.