Connect with us

Blood Drive

రక్త దానం ప్రాణ దానమే; గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ రక్త దాన శిబిరం విజయవంతం @ Cumming, Georgia

Published

on

Cumming, Georgia: జన్మభూమి అయిన భారత దేశమూ, కర్మభూమి అయిన అమెరికా దేశమూ ఇద్దరిపట్ల మనకు ఉన్న అపార రుణం, సేవారూపంలో చెల్లించాలన్న మనస్ఫూర్తి తపనతో, మానవతా మూర్తులైన మీ అందరితో కలిసి మన గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (GATeS) ఆధ్వర్యంలో ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని నిర్వహించగలిగాం.

“Divine Brotherhood under the Father of God” అనే సద్భావనతో, మన సహజీవుల పట్ల మన కర్తవ్యం నెరవేర్చే ప్రయత్నంగా రక్తదాన (Blood Donation) శిబిరం నిర్వహించి, అనేకమంది ప్రాణాలను కాపాడే పవిత్ర కార్యానికి చిరు సహాయాన్ని గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (Greater Atlanta Telangana Society – GATeS) ద్వారా అందించగలిగాం.

ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించిన సర్వజ్ఞుడు పరమాత్మకు, మమతా భరితంగా స్పందించిన ప్రతి రక్తదాతకు,మేము శిరసావహించుచు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం అని అన్నారు గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (Greater Atlanta Telangana Society – GATeS) నాయకులు.

సేవే పరమో ధర్మః
మీ GATeS Team
ధర్మ మార్గంలో.. మానవతా సేవలో…

error: NRI2NRI.COM copyright content is protected