గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (GATeS) అట్లాంటా, జార్జియా లోని Buford పార్కు నందు నిర్వహించిన ప్రశంసాపూర్వక విందు వినోద కార్యక్రమం “వనభోజనం” అట్లాంటా నగరమంతా ప్రత్యేక సందడ్లు నెలకొల్పింది అనడంలో అతిశయోక్తి లేదు.
ప్రామాణికంగా తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాలను ప్రోత్సహించే దిశలో విభిన్న సాంస్కృతిక సేవాకార్యక్రమాలతో ప్రఖ్యాతి చెందుతున్న GATeS సంస్థ ఆగస్టు 20, 2023 న ఆహ్లాదభరితమైన “వన భోజనం” కార్యక్రమంతో మూడు తరాల సమాహారంతో సుమారు 1200 అతిథులతో అనూహ్య పండుగ వాతారణాన్ని ప్రతిబింబిస్తూ విశేష ఆదరణ కైవశం చేసుకుంది.
ప్రకృతి సోయగాలు, పక్షుల కిలకిల రావాలు, పిల్ల గాలులు, కనులనలరించే సరస్సుతో సందర్శకులను మంత్రముగ్ధులను గావించే బహూసుందర పరిసరాలలో, తెలంగాణ ప్రామాణిక 8 రకాల సుమధుర శాఖాహార వంటకాలు, నోరూరించే 4 రకాల మాంసాహార వంటకాలు, పెరుగు, కమ్మని తీపి పదార్థాలు మరియు పిల్లల ప్రీతిపాత్రమైన ఐస్ క్రీములు, శీతల పానియాలతో, అతిథి మర్యాదలతో అతిధులకు వడ్డించిన తీరు ఎనలేని ఆత్మీయాభిమానాలతో ఆసాంతం అతిథులను అలరించడం ముదావహం.
సుదీర్ఘ కాలంగా ఈ కార్యక్రమం రూపకల్పన మొదలుకొని కార్యాచరణ వరకు అకుంఠిత శ్రమ మరియు పట్టుదలతో GATeS అధ్యక్షుల వారు, నిర్వాహక బృందం మరియు కార్యవర్గ సభ్యులు వారి సేవా నిబద్ధతను మరియు నిర్వహణా పటిమను ప్రతింబింబించాయి.
అందరికీ ఆదరణీయ ఆహ్వానాన్ని తెలుపుతూ GATeS సంస్థ అధ్యక్షులు శ్రీ జనార్ధన్ పన్నెల మరియు శ్రీనివాస్ పర్స కార్యక్రమాన్ని ప్రారంభించగా విచ్చేసిన EC, BOD, కార్యవర్గ సభ్యులు, సంస్థ స్థాపకులు మరియు సంస్థ పోషకులు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియచేశారు.
ఈ కార్యక్రమం ఉదయం ఆరు గంటలకు, గేట్స్ అధ్యక్షులు గేట్స్ కార్యనిర్వాహక సభ్యులు చైర్స్ కోచైర్స్, వాలంటీర్స్ ఉదయం 6 గంటలకు చేరుకొని వాన దేవతకు పూజ చేసి వంట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామ సేవలనందిస్తూ ఘుమఘుమలాడే వంటకాలను సిద్ధంచేసి వడ్డించి సాయంకాల ఫలహారాలు మిర్చి బజ్జీ, ఉల్లి పకోడా, చల్లని నీరు, కరుబూజపండు, వేయించిన మొక్కజొన్న, మసాలా టీలతో ఆద్యంతం అతిథులను అలరించడం హర్షణీయం.
విందుతో పాటు వినోదాన్ని పంచగా జ్యోత్స్న పాలకుర్తి గారు అనూహ్యంగా నిర్వహించిన ఆటలు టగ్ అఫ్ వార్ , రింగ్ టాస్ , లెమన్ స్పూన్ మరియు కోన్, గిల్లిదండ, పోటీ వంటివి చిన్న పెద్ద తేడా లేకుండా పిల్లలను పెద్దవాళ్లందరిని అత్యంత ఉల్లాసభరితులను గావించాయి.
EC సభ్యులు గణేష్ కసం మరియు బృందం రెండున్నర గంటల పాటు సుమారు 400 జన సమూహాన నిర్వహించిన Bingo ఆట ప్రత్యేక వినోదంగా నిలిచింది. పోటీల్లో గెలిచిన వారికి, ఇతరేతర ప్రత్యేక కళలను ప్రదర్శించిన వారికి అమెజాన్ గిఫ్ట్ కార్డులను బహికరిస్తూ ప్రోత్సహించడం అభినందనీయం.
సరదాల నవ్వుల్లో, ఆటపాటల్లో మమేకమై ఎన్నో నూతన స్నేహానుబంధాలను అల్లిన ఆ సాయంత్రం అందరికీ మధురానుభూతులను పంచింది. మధు నంబెటి, రవి కళ్లి, సంజీవ్ గారు&టీం చేసిన రుచికరమైన వంటకాలు అందరి మన్ననల్ని పొందాయి
TV9 తరపున శివ కుమార్ రామడుగు ప్రసార వార్త సేకరణ చేయగా, NRI2NRI.COM వెంకీ గద్దె వార్త సేకరణ చేసారు. GATeS శ్రేయోభిలాషి రఘు వలుసాని కార్యక్రమం ఆద్యంతం ఫోటోలు మరియు వీడియోల సేకరణ బాధ్యతను చేపట్టారు. కార్యక్రమము చివరలో గేట్స్ బోర్డు మెంబెర్స్ వాలంటీర్స్ కలిసి పార్క్ షెల్టర్స్ ని శుభ్రపరిచారు.
అద్భుత ప్రణాళిక, అద్వితీయ సారథ్యం అనూహ్య సహకార బృందం, అకుంఠిత శ్రమ, ఐకమత్య బలంతో నడయాడే GATeS సంస్థ యొక్క ప్రతి సేవా గమనం జయప్రదం అంటూ విచ్చేసిన అతిథుల హృదయపూర్వక ప్రశంసలు తెలిపారు. GATeS సభ్యత్వ జాబితాలో నూతన సభ్యుల నమోదు హోరెత్తగ “వనభోజనాలు” కార్యక్రమం సుమధురం, చిరస్మరణీయంగా ముగిసింది.
GATeS ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి హాజరైన వివిధ సంస్ధల ప్రతినిదులు, రాజకీయ నాయకులు, గౌరవనీయ అధ్యక్షులు: John’s creek city council member -Bob Erramilli, రవిచందర్క, కరుణాకర్ అసిరెడ్డి, సునీల్ సవెలి, ప్రశాంతి అసిరెడ్డి, అనిల్ బొద్దిరెడ్డి, శ్రీజన్ జోగినపల్లి, శ్రీధర్ తిరుపతి, భరత్ రెడ్డి మదాడి, కిషన్ తాళ్ళపల్లి, వెంకట్ వీరనేని, కిరణ్ రెడ్డి పాశం, సాయిరాం కారుమంచి, రత్నాకర్ ఎలుగంటి, వివేక్ రెడ్డి, తిర్మల్ పిట్ట, చాంద్ అక్కినేని, బాపు రెడ్డి కేతిరెడ్డి, హరీష్ సుదీని, స్వాతి సుదీని, డా. గణేష్ తోట, శ్రీధర్ నిమ్మ, వెంకట్ గడ్డం తదితరులు హాజరై గేట్స్ వారు అందించిన ఆతిధ్యాన్ని ఆస్వాదించి అభినందించారు.
ఈ కార్యక్రమం విజయవంతంకావడానికి నిరంతరం శ్రమ పడిన GATeS 2023 EC & BOD కి ప్రత్యేక ధన్యవాదములు :- జనార్ధన్ పన్నెల, శ్రీనివాస్ పర్సా, సందీప్ రెడ్డి, రమణ గండ్ర, నవీన్ వుజ్జిని, నవీన్ బత్తిని, ప్రభాకర్ మధుపతి, కీర్తిధర్ చక్కిలం, గణేష్ కాసం, రామకృష్ణ గండ్ర, చలపతి వెన్నమనేని, రామాచారి నక్కేర్తి ,జ్యోత్స్న పాలకుర్తి, గీత నారన్నగారి, రఘువీర్ రెడ్డి
అలాగే అవిశ్రాంతగా తమ విలువైన సహకారాలను అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రియ మిత్రులు మరియు గేట్స్ చైర్స్ అండ్ కోచైర్స్ కి ప్రత్యేక ధన్యవాదములు – కృష్ణ జాప ,నితిన్ జలగం, అశోక్ పల్ల, శివ కిరణ్ లింగిసెట్టీ, సంజీవ్ ఎక్కలురి, హరీష్ మరిపల్లి, అనూప్ మారెడ్డి, ప్రేంకుమార్ సలిదా శివ తల్లురి, స్వామి పల్ల, మహేష్ కొప్పు, మధు నంబేటి, రాజేష్ బెల్డ, దీపిక రెడ్డి నల్ల, డా. వాణీ గడ్డం, వినయ్ బాల్గొని, రాజీబ్ ముఖర్జీ, మధుకర్ రెడ్డి పటేల్, అనిల్ కుష్ణపల్లి, అరుణ్ కావటి, ఇన్నయ్య యనుముల, నర్సింగ్ రావు వట్నాల, మహేందర్ బూస, అజయ్ కుమార్ గోనె, జయచంద్ర రెడ్డి, కిషన్ దేవునూరి, మనోజ్ కుమార్ ముత్యం, మధు వేణు, ప్రమోద్ ఎనబొత్తుల, అనిల్ అర్షనపల్లీ