ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు అమెరికా పర్యటనకు రావడం జరిగింది. కాసేపటి క్రితమే న్యూ యార్క్ లోని John F. Kennedy International Airport లో ల్యాండ్ అయ్యారు. అక్కడ ఉన్న ప్రవాస భారతీయులతో కరచాలనం చేశారు. వారిలో ఎడిసన్ మేయర్ సామ్ జోషి ఉన్నారు.
ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు కూడా ఉన్నారు. 21న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాలకు నేతృత్వం వహిస్తారు. ఈనెల 21న ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు న్యూయార్క్‌లో జరిగే యోగా సెషన్‌లో పాల్గొంటారు.
ఐరాస ఉన్నతాధికారులు, పలు దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు కూడా పాల్గొంటారు. అక్కడి నుంచి వాషింగ్టన్ వెళ్లనున్న ప్రధాని 22న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో భేటీ అయి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడతారు. అదే రోజు సాయంత్రం బైడెన్ దంపతులు ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు.