నిస్వార్థ యోచన, స్నేహపూర్వక భావన సదా ఆదరణీయం మరియు ఆచరణీయం అని నిరూపించుకున్నారు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) ధర్మకర్తల మండలి (BOT), అధ్యక్ష (EC) మరియు కార్యవర్గ (Core) బృందం. తొలి అడుగులోనే అత్యద్భుత నిర్వహణా సామర్ధ్యంతో అబ్బురపరిచారు.
(భౌగోళికంగా) ప్రపంచ వ్యాప్తంగా, తెలంగాణ ప్రజలకు అండదండగా వారు నిర్వహించబోవు వివిధ సేవావిధులకు నాందిగా 08/12/2023 న అట్లాంటా లో Buford Dam వద్ద గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) నిర్వహించిన పల్లె వంట కార్యక్రమం సుమారు 1500 మంది అతిథులతో కళకళలాడటం అద్వితీయం అంటూ తొలి కార్యక్రమంతోనే పలువురి మన్ననలు పొందడం హర్షణీయం.
విచ్చేసిన అతిథులను ఆత్మీయులుగా మార్చిన అనురాగ పందిరిగా, మధురానుభూతులను పంచే శుభ వేదికగా, మాతృ ప్రేమను ఆసాంతం తలపించే అమృత వర్షిణిగా, అన్నపూర్ణగా Global Telangana Association (GTA) అందరి అభిమానాన్ని కైవశం చేసుకుంది అనడంలో అతిశయోక్తి లేదు.
25 రకాల నోరూరించే వంటకాలు, సంగీత దర్శకులు KP మరియు DJ శ్రీనివాస్ దుర్గం నిర్వహించిన పాటల అంత్యాక్షరి సందడ్లు, పిల్లల కేరింతలు, పెద్దవారి పలుకరింపులు, సాయంత్ర సమయాన మధురమైన పండ్లతో, ఆహ్లాదకర ప్రకృతి అందాల నడుమ ఆ శుభదినం సదా స్మరణీయం. అలుపెరుగని సైన్యంగా సహకారకుల సేవ అభినందనీయం.
Global Telangana Association (GTA) అట్లాంటా అధ్యక్షులు కరణ్ కేసిరెడ్డి నేతృత్వంలో ధర్మకర్త మండలి సభ్యులు బాపురెడ్డి కేతిరెడ్డి, కిరణ్ బద్దం, రాజేందర్ జనుంపల్లీ, స్వప్న కస్వా సారథ్యంలో కార్యనిర్వహక సభ్యులు అపర్ణ పింగ్లే, అరవింద్ కట్ట, చంద్ర సుబ్బగరి, సంతోష్ గడ్డం, సంతోష్ రెడ్డిమల్లి, రమాకాంత్ అన్నడి , కశ్యప్ రావు తంగడ, డా. నందిని సుంకిరెడ్డి, ఆనంద్ గుండు, రోహిత్ చెప్యాల, రోహిత్ మండల, శిల్ప సారపు, శ్రీనివాస్ దుర్గం, శ్రీలత శనిగరపు, అనంత్ జోషి, అరుణ్ దారపల్లి, ప్రణీత్ కుమార్ మదస్ , రమ్య కామరాజుగడ్డ, పల్లవి శివ తదితరుల సహాయ సహకారాలు అందించారు.
GTA సంస్థ అందించిన ఆతిథ్యానికి పల్లె వంటకి విచ్చేసిన Global Telangana Association చైర్మన్ విష్షు కలవల, అధ్యక్షులు ప్రవీణ్ కేసిరెడ్డి మరియు ATA, GATeS, GATA, IFA, TAMA, NATA, TTA, NRIVA వంటి మరెన్నో సేవాసంస్థల ప్రతినిధులు హృదయపూర్వక అభినందనలు వ్యక్తంచేశారు.
రానున్న కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మరెన్నో అద్భుత కార్యక్రమాలు చేపట్టాలని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా ఉత్సాహభరితులై యువత సేవల్లో పాలుపంచుకోవడం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. కార్యవర్గమంతా కార్యశీలురై తెల్లవారుజామున సంఘటనా స్థలానికి విచ్చేసి స్వయంగా వంటలు వండడం, వడ్డన కొరకు సుమారు 50 మందికి పైగా స్వచ్చందంగా ముందుకు రావడం ముదావహం.
అసాధారణ రీతిలో ఇంత ఘనమైన కార్యక్రమానికి దాతృత్వం వహించిన Bombay Lounge కి వినమ్ర కృతజ్ఞతాంజలి ఘటిస్తూ ఆహ్వానం మన్నించి విచ్చేసిన అట్లాంటా వాసులకు, విశేష అతిథులకు, కార్యక్రమం అద్భుతంగా రూపొందుకోవడానికి సహృదయ సహాయ సహకారాలు అందించిన వదాన్యులకు, సహకారకులకు GTA సంస్థ తమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంది.
అందరి ప్రేరణతో రానున్న కాలంలో మరిన్ని అద్భుత కార్యక్రమాలతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలను అలరించబోత్తున్నామని ఆనందోత్సాహాలతో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (Global Telangana Association) నాయకులు ప్రకటించారు. మరిన్ని ఫోటోల కొరకు www.NRI2NRI.com/GTA Palle Vanta 2023 In Atlanta ని సందర్శించండి.