ఆషాఢ నవరాత్రులు 2023 జూన్ 19వతేది సోమవారం నుండి జూన్ 28వ తేది బుదవారం వరకు ఉన్నవి. నాలుగు ముఖ్య మయిన నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహీ అమ్మవారు స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల (నాగలి), ముసల (రోకలి), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది.
ఇది మహా వారాహి (బృహద్వారాహి) యొక్క స్వరూపం. ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది. ఆషాఢ నవరాత్రి ప్రతి రోజూ, సప్త మాత్రుక దేవతలను మరియు అష్ట మాత్రుక దేవతలను పూజించడం, ఎనిమిదో రోజు వరాహి దేవిని పూజించడం వల్ల సంపన్నమైన జీవితం లభిస్తుంది.
పూజా విధానం: ఈ దేవికి నిత్య పూజాతో పాటు వారాహి అష్టోత్తరం, వారాహి షోడశ నామాలతో కుంకుమార్చన చేసుకోండి. వీలయినవరు వారాహి యొక్క స్తోత్రాలు, హృదయం, కవచం, సహస్రనామలు, సహస్రనామము. మొదలగు వాటిని పారాయణ చేసుకోవచ్చు. తప్పకుండా వారాహి షోడశ నామా స్తోత్రం పఠిచండి.
మొదటి రోజు (జూన్ 19) సోమవారం పూజ: ఉన్మత్త వారాహి పూజ రెండవ రోజు (జూన్ 20) మంగళవారం పూజ: బృహత్ వారాహి పూజ మూడవ రోజు (జూన్ 21) బుదవారం పూజ: స్వప్నవారాహీ పూజ నాల్గొవ రోజు (జూన్ 22) గురువారం పూజ: కిరాతవారాహి పూజ ఐదవ రోజు (జూన్ 23) శుకృవారం పూజ: శ్వేత వారాహి పూజ ఆరవ రోజు (జూన్ 24) శనివారం పూజ: ధూమ్రవారాహి పూజ ఏడవ రోజు (జూన్ 25) ఆదివారం పూజ: మహావారాహి పూజ ఎనిమిదవ రోజు (జూన్ 26) సోమవారం పూజ: వార్తాలి వారాహి పూజ తొమ్మిదవ రోజు (జూన్ 27) మంగళవారం పూజ: దండిని వారాహి పూజ
పదవ రోజు (జూన్ 28) బుధవారం పూజ: ఆది వారాహి మహపూజ మరియు ఉద్యాపన అమ్మవారి వైభవం: మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని. లలిత యొక్క రధ , గజ , తురగ , సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి. అందుకే ఆవిడను దండనాథ అన్నారు.
లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహా వారాహీ దేవి. లలితా దేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు. ఆమెకు ప్రత్యేక రథం ఉంది దానిపేరు కిరి చక్రం. ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి , రథసారథి పేరు స్థంభిని దేవి. ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరీ , మరియు దేవవైధ్యులైన అశ్విని దేవతలు. ఈ అమ్మవారిని ఆజ్ఞా చక్రంలో ధ్యానిస్తారు.
ఇతి శ్రీ వారాహి దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. “ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం ఠః ఠః స్వాహా” ఈ మంత్రాన్ని 108 నుండి 1008 సార్లు పఠిస్తే అనుకొన్న కార్యం ఫలిస్తుంది, నమ్మకంతో చేయాలి. ఉపదేశం లేని వారు అమ్మవారిని గురువుగా భావించి మంత్ర జపం చేసుకోండి.