కూసింత వెటకారం, కాసింత గోరోజనం, సౌమ్యులు, కల్మషంలేని మనుషులు, ఆతిథ్యానికి మారుపేరు, అతిథి మర్యాదల్లో సాటిలేని వారు. ఇలా వింటుంటేనే అర్ధం కావట్లా? ఆయ్! గోదారొళ్ల గురించే కదా చెప్తున్నారు అని. అందుకే అటు ఇండియా అయినా, ఇటు అమెరికా అయినా ‘గోదారోళ్ళు సర్ గోదారోళ్లే’ అంటారు.
మరి ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజాలు తింటూ, టీ తాగుతూ సరదాగా కబుర్లు చెప్పుకుందాం రండి అంటూ తన చుట్టూ ఉన్న నలుగురిని మనస్ఫూర్తిగా, ఆప్యాయంగా ఆహ్వానించే వాషింగ్టన్ డీసీ (Washington DC) వాసి సత్యనారాయణ మన్నే ఆ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల (Godavari Districts) ప్రవాసులలో ప్రత్యేకమైన వ్యక్తి.
ఎవరినైనా సరే చిన్న, పెద్ద, లేక ఐశ్వర్యవంతులా, లేదా అనేటువంటి విషయాలకు అతీతంగా తూలనాడడం గానీ, కిండలు చేయడంగానీ ఎరుగని వ్యక్తి సత్యనారాయణ మన్నే. ఉభయ గోదావరి జిల్లాల పుడమితల్లి అభివృద్ధికి ఏంచేయాలో ఆలోచిద్దాం, ఆ ఆలోచనల కార్యాచరణకు ఉపక్రమిద్దాం అంటూ గోదావరి ఎన్నారై సభ్యులను ఉత్సాహపరచడంలో ముందుంటారు.
గత 15 సంవత్సరాలుగా సేవా దృక్పధంతో, అంతః కరణ శుద్దితో అమెరికాలో ప్రవాస తెలుగు వారి మానస పుత్రిక తానా సంస్థలో సౌమ్యునిగా, కార్యకర్తగా, దాతగా అందరికీ సుపరిచితులు సత్యనారాయణ మన్నే. అమెరికా రాజధాని ప్రాంతం వాషింగ్టన్ డీసీ లో తానా (TANA) కార్యక్రమాలలో శ్రీయాశీలకంగా వ్యవహరిస్తూవస్తున్నారు.
2007 తానా (Telugu Association of North America) మహాసభల హాస్పిటాలిటీ కమిటీ సభ్యునిగా, 22వ తానా మహాసభల (Convention) CME కోఆర్డినేటర్ గా, హోస్ట్ కమిటీ ఛైర్ గా, 2020-21 తానా బ్యాక్ ప్యాక్ కమిటీ ఛైర్ గా పలు విధాలుగా తానాలో నిష్కళంక సేవలందించారు.
స్థానిక బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) లో యూత్ వైస్ ప్రెసిడెంట్, సెక్రెటరీ, వైస్ ప్రెసిడెంట్ ఇలా వివిధ పదవులు నిర్వహించి చివరికిఅధ్యక్షునిగా రెండు సంవత్సరాలపాటు తన హయాంలో (Satyanarayana Manne) చెరగని ముద్ర వేశారు. తెలుగుదనానికి అద్దంపట్టేలా తెలుగువారందరికీ చక్కటి వినోదాన్ని, వికాసాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను జీడబ్ల్యూటీసీఎస్ అందించేలా కృషి చేశారు.
Greater Washington Telugu Cultural Sangam (GWTCS) అంతకుముందు నిర్వహించిన కార్యక్రమాలకు భిన్నంగా, తన హయాంలోమొట్టమొదటిసారి యల్ఈడి డిజిటల్ స్క్రీన్స్ ద్వారా స్పాన్సర్స్ వీడియో ప్రకటనలు, మూవీ ప్రోమోస్, పండుగ శుభాకాంక్షలు, తదితర ప్రజంటేషన్స్ అందరూ అయ్యారే అనిపించేలా విభిన్నంగా నిర్వహించారు.
అనంతరం GWTCS పూర్వాధ్యక్షులుగా, స్పాన్సర్ గా వ్యవహరించి దాతృత్వాన్ని చాటుకున్నారు. అలాగే అంతర్జాతీయ సంఘాలైన NCAIA, గోదావరి జిల్లా వాసుల ప్రవాస సంఘం మరియు చేతన గ్లోబల్ ఫౌండేషన్ (Chetana Global Foundation) సేవా సంస్థల్లో ప్రాతినిధ్యం వహిస్తూ సేవా కార్యక్రమాలకు తనదైన సహాయం అందిస్తున్నారు.
నలుగురితో కలిసి నేను, నలుగురి కోసం ముందుగా నేను అని నమ్ముతూ కాలంతో పోటీపడి ఇన్ని సంవత్సరాలుగా సామాజిక, కళా, సంస్కృతీ, సేవా రంగాలలో పలు తరాల వయసున్న వారితో కలిసి పనిచేస్తూ మరియు నేర్చుకుంటూ సాగుతున్న సత్యనారాయణ మన్నే (Satyanarayana Manne) పయనం అభినందనీయం.
ఇప్పుడు మరో మజిలీలో తానా (Telugu Association of North America) వేదికపై నూతన బాధ్యతను తీసుకునేందుకు సిద్ధమై తానా సభ్యుల ముందుకు వచ్చారు. అందరి సహకారం, ఆశీస్సులు కోరుకుంటూ 2023-27 కాలానికి జరుగుతున్న తానా ఎన్నికలలో ఫౌండేషన్ ట్రస్టీ (Foundation Trustee) గా పోటీ చేస్తున్నారు.
తనతోపాటు టీం వేమూరి ప్యానెల్ (Team Vemuri Panel) లోని ప్రతి ఒక్కరికీ ఓటు వేసి తానా ఫౌండేషన్ (TANA Foundation) సేవాకార్యక్రమాల పరిధిని పెంచేలా మరియు తానా పురోగతికి అంకితభావంతో పనిచేసేలా తోడ్పడాలని తానా సభ్యులను/ఓటర్లను అభ్యర్థిస్తున్నారు సత్యనారాయణ మన్నే.