. కొత్తగాగ్లోబల్ తెలంగాణ సంఘం లాంచ్ . వ్యవస్థాపకులుగా ఎన్నారై విశ్వేశ్వర్ రెడ్డి కలవల . సహ వ్యవస్థాపకులుగా మల్లారెడ్డి అలుమల్ల, శ్రవణ్ రెడ్డి పాడూరు . ఇండియా విభాగం ప్రెసిడెంట్ గా శ్రీనివాస రెడ్డి పాడూరు . ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హాజరు . రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ డ్రీం వాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్ వేదిక . పెద్ద ఎత్తున తెలంగాణ వాసులు హాజరు
ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటికప్పుడు కొత్త తెలుగు సంఘాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పలు తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాయి. ఇటు అమెరికా, అటు ఇండియా మరియు ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్కృతీ సంప్రదాయాలను పెంపొందించేలా తమ పరిధిలో ఈ సంఘాలు పనిచేస్తున్నాయి.
ఇప్పుడు కొత్తగా జనవరి 11, బుధవారం రోజున గ్లోబల్ తెలంగాణ సంఘం (Global Telangana Association) ఆవిర్భవించింది. హైదరాబాద్ కి దగ్గిర్లోని రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలం, బకరం జాగిర్ గ్రామంలోని డ్రీం వాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఈ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) ని లాంచ్ చేశారు.
సాయంత్రం 4 గంటల నుండి ఏర్పాటు చేసిన సభలో ఈ గ్లోబల్ తెలంగాణ సంఘం వ్యవస్థాపకులు విశ్వేశ్వర్ రెడ్డి కలవల, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ నాయకులు ధర్మపురి అరవింద్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల వంటి పలువురు నాయకులు, పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు పాల్గొన్నారు.
స్వాగతోపన్యాసం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ తెలంగాణ గాయని పెద్దింటి మధు ప్రియ (Singer Madhu Priya) పాటలతో అలరించారు. అనంతరం పెద్దలను, నాయకులను, విద్యావేత్తలను, ఎన్నారైలను వేదిక మీదకు ఆహ్వానించగా జ్యోతి ప్రజ్వలన గావించారు.
ఈ సందర్భంగా నిజామాబాద్పార్లమెంట్ సభ్యులు, బీజేపీ నాయకులు ధర్మపురి అరవింద్ (Dharmapuri Aravind) మాట్లాడుతూ… 180 దేశాల్లో ఉన్న తెలంగాణ వారందరినీ ఒక గొడుకు కిందకు తీసుకువచ్చేలా ఈ గ్లోబల్ తెలంగాణ సంఘం ఏర్పాటు చేసిన వ్యవస్థాపకులు విశ్వేశ్వర్ రెడ్డి కలవల ను, తను చేస్తున్న సేవలను అభినందించారు.
అలాగే వ్యవస్థాపకులు విశ్వేశ్వర్ రెడ్డి కలవల ప్రసంగిస్తూ… తెలంగాణ అభివృద్ధి, సంస్కృతి లను ప్రపంచ వ్యాప్తం చేసేలా 4 కోట్ల తెలంగాణ సమాజాన్ని ఏకం చేసే లక్ష్యంతోనే ఈ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (Global Telangana Association) ని రెండు సంవత్సరాలపాటు రూపుదిద్దామని అన్నారు.
తర్వాత పలువురు నేతలు ప్రసంగించారు. జై తెలంగాణ నినాదాలతో సభాప్రాంగణాన్ని హోరెత్తించారు. మిమిక్రీ రమేష్, కామెడీ నటులు శివారెడ్డి, జబర్దస్త్ కమెడియన్స్ అందరినీ తమ కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. చివరిగా వందన సమర్పణతో ఈ కార్యక్రమం విజయవంతంగాముగిసింది.