ప్రభంజనం.. జన సముద్రం.. నేల ఈనిందా.. ఆకాశం వర్షించిందా.. అన్నట్లుగా.. వాషింగ్టన్ డీసీ గ్లోబల్ తెలంగాణ సంఘం (Global Telangana Association) సద్దుల బతుకమ్మ మరియు దసరా సంబరాలు జరిగాయి.
గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) వాషింగ్టన్ డీసీ వారు అక్టోబర్ 22 ఆదివారం రోజున బ్రాడ్ రన్ హైస్కూల్ లో నిర్వహించిన మొదటి సద్దుల బతుకమ్మ & దసరా సంబరాలు నభూథో నభవిష్యత్తు అనేలా ఇంతకు ముందు వాషింగ్టన్ డీసీ (Washington DC) బతుకమ్మ చరిత్రలో జరగని విధంగా నిర్వహించారు.
అధిక సంఖ్యలో మహిళలు, పురుషులు మరియు పిల్లలు సుమారు 5000 అతిథులు వరకు పాల్గోని సద్దుల బతుకమ్మ మరియు దసరా వేడుకలను ఘనంగా విజయవంతం చేసారు. GTA సంస్థ చైర్మన్, గ్లోబల్ ఉపాధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, వాషింగ్టన్ డీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రెటరి, జాయింట్ సెక్రెటరి, ఎక్స్కూటివ్ కమిటి, కమిటి చైర్స్ & కో-చైర్స్ కలిసి జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
GTA సంస్థ వాషింగ్టన్ డీసీ అధ్యక్షులు తిరుమల్ మునుకుంట్ల సారధ్యంలో పెద్ద బతుకమ్మ లతో సుమారు 200 పైగా బతుకమ్మ లను తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ పండుగ కనుక మహిళలు, రాజకీయ నాయకులు, సంస్థ నిర్వాహాకులు అధిక సంఖ్యలో పాల్గోని డోలు డప్పులతో మరియు పోతురాజు విన్యాసాలతో ఊరేగింపు గా తీసుకరావటం జరిగింది.
బెస్ట్ బతుకమ్మ లకు బంగారు బహుమతులు మరియు పట్టు చీరలు, కిడ్స్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, కోళాటం జానపద నృత్యాలు, డ్యాన్స్ పోటీలు, గౌరి మరియు జమ్మి పూజ Global Telangana Association వారు నిర్వహించారు. స్థానిక రెస్టారెంట్ కంట్రీ ఓవెన్ అధినేత శ్రవణ్ పాడూరు భోజన కార్యక్రమాన్ని లీడ్ చేశారు.
శ్రవణ్ సారధ్యంలో వర్జీనియాలో వున్న ప్రముఖ రెస్టారెంట్స్ పారడైజ్ ఇండియన్ కుసిన్, ఉడ్ల్యాండ్స్, కాకతీయ కిచెన్, తవ ఫ్రై, పేస్ట్రి కార్నర్ మరియు హైదరాబాద్ బిర్యాని పాట్, మేము కూడా తమ వంతు సహాయంగ పాల్గోని ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 3:00 సుమారు 5000 అతిథులకు ఉచితంగా పసందైన భోజన కార్యక్రమం నిర్వహించారు.
గ్లోబల్ తెలంగాణా అసోసియేషన్ (GTA) సంస్థ చైర్మన్ విశ్వేశ్వర కలువల (Vishweshwar Kalavala), ఉపాధ్యక్షులు శ్రవణ్ పాడూరు, వాషింగ్టన్ డీసీ అధ్యక్షులు తిరుమల్ మునుకుంట్ల మాట్లాడుతూ.. తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ పండుగ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గోన్నారన్నారు.
గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) వాషింగ్టన్ డీసీ వారు నిర్వహించిన మొదటి సద్దుల బతుకమ్మ & దసరా సంబరాలను బతుకమ్మ చరిత్రలో జరగని విధంగా అధిక సంఖ్యలో పాల్గోని గొప్ప ఘనవిజయం లో తోడ్పడిన మహిళలు, రెస్టారెంట్స్, బిజినెస్ ఎగ్జిబిట్ స్టాల్స్, స్పాన్సర్స్, వాలంటీర్స్, పోలీస్ సిబ్బంది, స్కూల్ సిబ్బంది కి ప్రత్యేక ధన్యావాదాలు తెలియజేసారు.