▪️ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ‘మీట్ అండ్ గ్రీట్’ వేడుక
▪️ జీటీఏ ఫౌండర్, ఇండియా ఛైర్మన్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో GTA తొలి వార్షికోత్సవం
▪️ అతిథులుగా పాల్గొన్న బండి సంజయ్, ఈటల, పలువురు ఎమ్మెల్యేలు
▪️ శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మించడంలో GTA భాగస్వామం కావాలి: బండి సంజయ్
▪️ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ వారందరిని కలుపుతున్న GTA: ఈటల
▪️ పలు దేశాల నుంచి వచ్చి వేడుకల్లో పాల్గొన్న GTA సభ్యులు
ప్రపంచంలోనే శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మించడంలో భాగస్వామం కావాలని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA )ను కోరారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar). వివిధ దేశాల్లోని తెలంగాణ వారందరిని ఒక్కచోటకు చేర్చుతున్న GTA ను అభినందించారు.
హైదరాబాద్ (Hyderabad) లోని హోటల్ మారియట్ (Hotel Marriot) లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (Global Telangana Association) నిర్వహకులు యోయో టీవీ అధినేత మల్లారెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. తనతోపాటు ఈ మీటింగులో ఉన్న లీడర్లు, అనేక మంది ఎన్నారైలు డబ్బు లేకపోయినా కష్టపడి పైకొచ్చినవారేనన్నారు. ఎక్కడో విదేశాల్లో ఉంటూ భారత్ అభ్యున్నతికి కృషి చేస్తున్న ఎన్నారైల సేవలు మరువలేనివన్నారు. ప్రవాస తెలంగాణ వాసులతో కలిపి ఏర్పాటుచేసిన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫోరం ఏడాది పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమానికి హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి ఇతర దేశాల్లో చాటుతుంది తామేనని ఈ సందర్భంగా జీటీఏ ఫౌండర్, ఇండియా ఛైర్మన్ మల్లారెడ్డి తెలిపారు. ఎన్నారై తలుచుకుంటే.. ఒక రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా అభివృద్ధి చేసి చూపించగలడని ఆయన చెప్పారు. ఏటా ఈ మీట్ ఉంటుందని.. దీని ద్వారా తెలంగాణ లోని సమస్యలను తెలుసుకోవడంతోపాటు.. ఇక మీదట చేయాల్సిన సంక్షేమం, సాయంపై చర్చించి ముందుకు సాగుతామని తెలిపారు.
తెలంగాణ (Telangana) లో పుట్టి ఇక్కడే చదువుకొని.. ఇతర దేశాలకు వెళ్లి ఒక హోదాను సంపాదించి.. పుట్టిన ఊరుతో పాటు తెలంగాణకు సేవా చేయ్యాలనే ఆలోచనతో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ను ఏర్పాటు చేశామని జీటీఏ యూఎస్ఏ చైర్మన్ విశ్వేశ్వరరెడ్డి కలవల (Vishweshwar Reddy Kalavala) చెప్పారు.
ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. మాజీ మంత్రులు ఈటల రాజేందర్ (Etela Rajender), ఇ పెద్దిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయ్యాలనే ఉద్దేశ్యంతో స్థాపించిన జీటీఏ మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు బీజేపీ నేత రాణి రుద్రమ అన్నారు.
ఎన్నారైలంతా ఇదే ఉత్సాహంతో పని చెయ్యాలని సూచించారు. తాము జీటీఏకు అండగా ఉంటామన్నారు. మిమ్మల్నందరిని చూస్తే.. అన్ని దేశాలు చూసినట్టు ఉంటుందని, అందుకే వచ్చానని, ఇంత గొప్ప ప్రోగ్రాంలో తనను భాగస్వామ్యం చేసినందుకు సంతోషంగా ఉందని ఎమ్మెల్యే (Member of Legislative Assembly) రాకేశ్ రెడ్డి చెప్పారు.
ఇక్కడ తెలంగాణలోని సమస్యలను చెబితే ప్రపంచదేశాలకు వెళ్తుందని చెబుతున్నానని తెలిపారు. పల్లెల్లో జరగాల్సిన అభివృద్ధి ఇంకా ఎంతో ఉందని.. నగరాల్లోనే కాకుండా పల్లెల్లో కూడా ఎన్నారైలంతా తమ సాయాన్ని అందించాలని రాకేష్ రెడ్డి కోరారు. ఆ వెంటనే స్పందించిన జీటీఏ ఇండియా ఛైర్మన్ వివరాలు తీసుకొని తప్పకుండా సమస్యలను తీర్చి సంక్షేమానికి బాట వేస్తామని చెప్పారు.
ఎన్నారైలు అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చి కుటుంబాన్ని కలిసే వాళ్లు మాత్రమే కాదని జీటీఏ నిరూపించిందని ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి అన్నారు. ఎన్నారైలు తలుచుకుంటే దేనానైనా సాధిస్తారు.. వారిని తక్కువ అంచన వేయొద్దని చెప్పారు. ప్రపంచ దేశాల్లో ఉన్న మన తెలంగాణ ఎన్నారైలను చూసే అవకాశం మొదటిసారి ఈ వేదిక ద్వారా వచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి అన్నారు.
తెలంగాణ లో నిరుద్యోగ సమస్య అత్యధికంగా ఉంది.. జిల్లాలో కేంద్రాల్లో ఉన్న నిరుద్యోగులకు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ తరఫున ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. ఇలాంటి వేదికలు తమకు స్పూర్తిగా ఉంటాయని ఎమ్మెల్యే మదమ్ మోహన్ రావు అన్నారు. ఈ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మరింత విస్తారించాలని కోరారు.
తమ మద్దతు జీటీఏ (Global Telangana Association) కు ఉంటుందని ఎమ్మెల్యే మందుల సామెల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియాకు చెందిన 150 మంది బోర్డు సభ్యులు హాజరయ్యారు. ఇండియాలో జీటీఏను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై మీటింగ్ నిర్వహించారు మల్లారెడ్డి.
అనంతరం మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఇండియా ఛైర్మన్ మల్లారెడ్డి తోపాటు జీటీఏ (GTA) అడ్వజర్ ఛైర్ రవీందర్ రెడ్డి, జీటీఏ అడ్వజర్ ఛైర్ డాక్టర్ విజయేందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, జే మీడియా అధినేత నరేందర్, ప్రతిప్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సమత, ఇతర బోర్డు సభ్యులు జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు.
ప్రపంచ దేశాల నుంచి జీటీఏ వేదికను పంచుకోవడానికి వచ్చిన వారిలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ వైస్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్ అభిషేక్ రెడ్డి, అడ్వజర్ ఛైర్ రవీందర్ రెడ్డి, అడ్వజర్ ఛైర్ ప్రమోద్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లు జే మీడియా అధినేత నరేందర్, ప్రతాప్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సమత, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు.. స్వామి, రాజగోపాల్, ప్రమోద్ కుమార్, జేడీ చక్రవర్తి, శ్రీవికాస్, డాక్టర్ చరణ్ జిత్, డాక్టర్ శోభాదేవి పాల్గొన్నారు.
వాషింగ్టన్ డీసీ (Washington DC) నుండి తిరుమల్ మునుకుంట్ల, రాము ముండ్రాతి, ప్రవీణ్ పల్రెడ్డి, సంపత్ దేశినేని, రామ్ మోహన్ రేగులపాటి పాల్గొన్నారు. వీరిలో ఎన్నారైలు, లాయర్లు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నృత్య, సాంస్కృతిక, పాటల కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.
ఈ మీట్ అండ్ గ్రీట్ లో జీటీఏ బోర్డు సభ్యులతోపాటు యోయో మీడియా సీఈవో నవీన్ రెడ్డి, చీఫ్ ఎడిటర్ స్వర్ణవిజిత, ప్రజా ప్రతినిధులు బండి సంజయ్, యశశ్విని, పాయల్ శంకర్, రాకేష్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వేముల వీరేశం, భూపతి రెడ్డి, మదన్ మోహన్ రావు లు, ఎన్నారై ఝాన్సీరెడ్డి, కొండారెడ్డి రవీందర్ రెడ్డి, అనిరుద్ రెడ్డి లతోపాటు వివిధ దేశాల వచ్చిన ఎన్నారైలు, నటులు రోహిత్ కుమార్, తెలంగాణ ఫోక్ సింగర్లు బిక్షునాయక్, గంగమ్మ, పారిజాతం తదితరులు పాల్గొన్నారు.
జీటీఏ (Global Telangana Association) ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ ఎన్నారైలు మీట్ అండ్ గ్రీట్ (Meet and Greet) లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, నిర్వహణకు సహకరించిన స్పాన్సర్లకు జీటీఏ ఫౌండర్, ఇండియా ఛైర్మన్ మల్లారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.