Connect with us

Events

GTA Washington DC Chapter సద్దుల బతుకమ్మ & దసరా సంబరాలు అక్టోబర్ 22న

Published

on

గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్(GTA) సద్దుల బతుకమ్మ & దసరా సంబరాలు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ లో అక్టోబర్ 22 ఆదివారం రోజున బ్రాడ్ రన్ హైస్కూల్ లో మద్యాహ్నం 12 నుండి సాయంత్రం 7 గంటల వరకు సుమారు 3000 పైగా హాజరవుతారని అంచనా.

ఉచిత భోజనము, షాపింగ్ మాల్, బెస్ట్ బతుకమ్మ లకు బంగారు బహుమతులు, కిడ్స్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, జానపద నృత్యాలు, డ్యాన్స్ పోటీలు, గౌరి మరియు జమ్మి పూజ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వాషింగ్టన్ డీసీ కమిటి వారు ఏర్పాట్లు చేస్తున్నారు.

GTA వాషింగ్టన్ డీసీ తెలంగాణ ఆడపడుచుల ఆటపాటలతో సద్దుల బతుకమ్మ & దసరా సంబరాల టీజర్  మరియు పోస్టర్ లాంచ్ కార్యక్రమానికి వివిధ నగరాల నుంచి సుమారు 500 పైగా హాజరయినారు. అక్టోబర్ 21 శనివారం రోజున తెలంగాణ సంస్కృతి ని కిడ్స్ కి పంచె విధంగా బతుకమ్మ వర్క్ షాప్ నిర్వహించటం జరుగుతుంది.

తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగనే బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే సందడిగా కనబడుతుంది. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.

ఎనిమిది రోజుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిపి ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మలతో ఈ ఎనిమిది రోజులు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.

బతుకమ్మ పండగలో ఆఖరి 9వ రోజు ‘సద్దుల బతుకమ్మ’ను ఆరాధిస్తారు. ఆ రోజు ఎన్ని పూలు దొరికితే అన్ని పూలతో బతుకమ్మను పెద్దగా అందంగా వివిధ రంగులతో ముస్తాబుగా పేరుస్తారు. ఆడవారు తమ ఆటపాటలతో ‘సద్దుల బతుకమ్మ’ పండుగను సంతృప్తిగా జరుపుకుంటారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected