ఉత్తర అమెరికా తెలుగు సమితి (North American Telugu Association – NATA) ‘నాటా’ టెక్సస్ రాష్ట్రం, డల్లాస్ మహానగరంలోని డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ లో జూన్ 30, జులై 1, జులై 2న ఘనంగా నిర్వహిస్తున్న కన్వెన్షన్ ఏర్పాట్లు దాదాపు పూర్తి అయ్యాయి.
ఇండియా నుంచి ప్రముఖులు, తెలుగు సినీ తారాగణం, అమెరికాలోని పలు ప్రాంతాల నుండి అందరూ తరలి వస్తున్నారు. ఎయిర్పోర్ట్ పికప్స్, హోటల్ ఏర్పాట్లతో నాటా కన్వెన్షన్ లీడర్షిప్ మరియు వివిధ కమిటీల సభ్యులు బిజీ బిజీగా ఉన్నారు.
రేపు బాంక్వెట్ డిన్నర్ తో మొదలై అన్ని వివరాలతో ప్రోగ్రాం షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ప్రోగ్రాం గైడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. రెండు సంవత్సరాలకు ఒకసారి NATA తెలుగు ప్రజలందరినీ ఒక తాటి పై తీసుకువచ్చే అతిపెద్ద వేడుకలను నిర్వహిస్తుంది.
నాటా (North American Telugu Association) కన్వెన్షన్‌ను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు నాటా అధ్యక్షులు డా. శ్రీధర్ రెడ్డి కొర్సపాటి (Dr. Sridhar Reddy Korsapati) మరియు నాటా కన్వీనర్ NMS రెడ్డి ఆధ్వర్యంలోని జాతీయ కన్వెన్షన్ కమిటీ తీవ్రంగా శ్రమిస్తోంది.
చక్కని ఏర్పాట్లతో గ్రాండ్ గా అన్ని విషయాల్లోనూ ఎక్కడా రాజీ లేకుండా నాటా మహాసభలను నిర్వహించనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, తమన్, అనూప్ రూబెన్స్ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్స్, సదస్సులు వంటి పలు జనాకర్షక కార్యక్రమాలు మచ్చుకు ఉన్నాయి.
మోక్ టైల్ మ్యూజిక్ బ్యాండ్ తో యూత్ బాంక్వెట్, బోట్ పార్టీ, శ్రీనివాస కళ్యాణం, సాహిత్య వేదిక, బిజినెస్ సెమినార్స్, ఆలంనై మీట్స్, ఇమ్మిగ్రేషన్ సెమినార్స్, పొలిటికల్ ఫోరం, ప్యానెల్ డిస్కషన్స్, ఉమెన్స్ ఫోరమ్, షాపింగ్ స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా మరెన్నో ప్రత్యేక కార్యక్రమాలు అలరించనున్నాయి.