Frankfurt, Germany: స్వర్గీయ ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని జర్మనీ (Germanny) లోని ఫ్రాంక్ ఫర్ట్ (Frankfurt) టీడీపీ (TDP) ఆధ్వర్యంలో మినీ మహానాడు (Mini Mahanadu) వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి శాసనసభ్యురాలు గౌతు శిరీష (Gauthu Sirisha), గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు (Mannava Subbarao) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విశ్వవిశ్యాత అన్న ఎన్టీఆర్ (NTR) కు ఘనంగా నివాళులు అర్పించి వేడుకలను ప్రారంభించారు. ఫ్రాంక్ ఫర్ట్ (Frankfurt) లో నిర్వహించిన 34వ మహానాడు అనేక ప్రాధాన్యతలను సంతరించుకుంది. సినీ నటుడిగా ఎన్టీఆర్ (NTR) ప్రస్థానం మొదలై ఈ ఏడాదికి 75 వసంతాలు పూర్తయ్యాయి.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సినీ వజ్రోత్సవాలను ప్రపంచవ్యాప్తంగా వైభవంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) గారు 75 వసంతాలు పూర్తిచేసుకున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రతిష్టాత్మక పద్మభూషన్ (Padma Bhushan) అవార్డును అందుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 94 శాతం స్ట్రైక్ రేటుతో కూటమికి 164 సీట్లతో ప్రజలు బ్రహ్మరథం పట్టిన నేపథ్యంలో సంబరాలు అంబరాన్ని అంటాయి.
ఈ సందర్భంగా శాసనసభ్యురాలు గౌతు శిరీష (Gauthu Sirisha) మాట్లాడుతూ.. నేడు దేశంలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటికీ ఎన్టీఆరే ఆయనే ఆధ్యుడని అన్నారు. కిలో రూ.2 కే బియ్యం, పేదలకు పక్కా గృహాలు, జనతావస్త్రాల లాంటి అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. జీవించిన కాలం ఎంతనేదాని కన్నా ఎలా జీవించామనేది ముఖ్యమని, ప్రతి అడుగు ప్రజల కోసం, ప్రగతికోసం తపిస్తూ ఎన్టీఆర్ (NTR) అనేక పాలనాసంస్కరణలు తీసుకువచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు.
మన్నవ సుబ్బారావు (Mannava Subbarao) మాట్లాడుతూ.. ఫ్రాంక్ ఫర్ట్ (Frankfurt) మినీ మహానాడు (Mini Mahanadu) కు ఇంత భారీ స్థాయిలో స్పందన వస్తుందని ఊహించలేదు. యూరప్ (Europe) దేశాల నుంచి పెద్దఎత్తున టీడీపీ (TDP) అభిమానాలు, శ్రేణులు తరలిరావడం ఆశ్చర్యానికి గురిచేసింది. తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న అభిమానానికి ఇది నిదర్శనమన్నారు.
సుమంత్ కొర్రపాటి (Sumanth Korrapati) మాట్లాడుతూ.. కూటమి విజయానికి ప్రవాసాంధ్రులు ఎంతో కృషి చేశారని అన్నారు. టిట్లు మద్దిపట్ల (Titlu Maddipatla) మాట్లాడుతూ.. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వ విజయాలను వివరించారు. మినీమహానాడు (Mini Mahanadu) లో స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) కు భారతరత్న (Bharat Ratna) ఇవ్వాలని తీర్మానించారు. దీంతో పాటు పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి మృతులకు సంతాపం తెలియజేశారు.
చనిపోయిన కార్యకర్తలకు నివాళి అర్పించారు. చరిత్రాత్మక విజయంలో భాగస్వాములైన వారికి కృతజ్ఞతలు, ఎన్ఆర్ఐ (NRI) లకు ప్రత్యేక సెల్, పద్మభూషణ్ (Padma Bhushan) అందుకున్న బాలకృష్ణ (Balakrishna) గారిని అభినందిస్తూ తీర్మానించారు. అనంతరం అతిథులకు వివిధ రకాల తెలుగు వంటకాలతో విందు భోజనాలు ఏర్పాటుచేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిఒక్కరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ కుడితిపూడి (Srikanth Kudithipudi), శివ బత్తుల (Shiva Bathula), పవన్ కుర్రా (Pawan Kurra), నరేష్ కోనేరు (Naresh Koneru), వెంకట్ కాండ్ర (Venkat Kandra), వంశీ దాసరి (Vamsi Dasari), శివశంకర్ లింగం (Shiva Shankar Lingam) తదితరులు పాల్గొన్నారు.