Connect with us

News

బతుకమ్మకు Georgia Governor బ్రయన్ కెంప్ గుర్తింపు, ప్రొక్లమేషన్ అందుకున్న GTA Atlanta Chapter

Published

on

గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (Global Telangana Association – GTA) అట్లాంటా చాప్టర్ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ఇందులో భాగంగా గత సంవత్సరం సుమారు 5000 మందితో అట్లాంటా (Atlanta) లో పెద్ద ఎత్తున తెలంగాణ పండుగ బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.

అలాగే గ్లోబల్ తెలంగాణ సంఘం (GTA) అట్లాంటా చాప్టర్ నాయకులు (GTA Atlanta Chapter Leaders) బతుకమ్మకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు కృషి చేశారు. ఈ కృషి ఫలితంగా జార్జియా గవర్నర్ బ్రయన్ కెంప్ (Georgia Governor Brian Kemp) బతుకమ్మకు ప్రత్యేక గుర్తింపునిస్తూ గత అక్టోబర్ 20, 2023 న ప్రొక్లమేషన్ ఇచ్చారు.

ఈ ప్రొక్లమశన్ ని అందుకునేందుకు GTA అట్లాంటా చాప్టర్ నాయకులు మరియు సభ్యులు ఆగష్టు 21, 2024 న గవర్నర్ బ్రయన్ కెంప్ తో జార్జియా క్యాపిటల్ బిల్డింగ్ లో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఆఫ్ జార్జియా లెటర్ హెడ్ పై “BATHUKAMMA, A FLOWER FESTIVAL AND TELANGANA HERITAGE WEEK” అంటూ గవర్నర్ చేతులమీదుగా ప్రొక్లమేషన్ అందుకున్నారు.

ఈ సందర్భంగా GTA (Global Telangana Association) అట్లాంటా చాప్టర్ నాయకులు కృతజ్ఞతలు తెలుపుతూ గవర్నర్ బ్రయన్ కెంప్ ని శాలువాతో సత్కరించారు. ఆలాగే ఈ సంవత్సరం వచ్చే అక్టోబరు 5వ తేదీన నిర్వహించనున్న మెగా బతుకమ్మ (Bathukamma) సంబరాలకు ఫస్ట్ లేడీ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected