Connect with us

Telangana

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింభించేలా జూన్ 10న రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలు: GATeS

Published

on

అట్లాంటా మహా నగరంలో కనుల పండుగగా, అంగరంగ వైభవంగా గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ నిర్వహిస్తున్న తెలంగాణ అవతరణ దినోత్సవ సంబురాలు (సాంస్కృతిక దినోత్సవం) జూన్ 10 వ తేదీ శనివారం రోజున మధ్యాహ్నం మూడుగంటలకు గ్యాస్ సౌత్ కన్వెన్షన్ సెంటర్లో జరగబోతున్నాయి.

ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి ఎంతో మంది ప్రముఖులు రాబోతున్నారు. ముఖ్యంగా గేట్స్ ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిధిగా ఆస్కార్ అవార్డు గ్రహీత శ్రీచంద్రబోస్ గారు ఆస్కార్ అవార్డు అందుకున్న జ్ఞాపకాలను మరియు వారు సినిమాల్లో రాసినా పాటలను, మాటలను పంచుకోవడానికి విచ్చేయుచున్నారు.

తన వ్యాఖ్యానంతో మనల్ని అలరించడానికి ప్రముఖ వ్యాఖ్యాత ఉదయభాను గారు, లైవ్ బ్యాండ్ చంటి బృందంతో గాయకులూ ప్లేబాక్ సింగర్ సాకేత్ కొమాండూరి, ప్లేబాక్ సింగర్ సుమంగళి గారు, ప్రవాస జానపద గాయకులూ మరియు గేట్స్ అధ్యక్షులు జనార్దన్ పన్నెల గారు గాయని శ్రీష్టి చిల్ల తమ పాటలతో ఆటలతో మనల్ని ఉర్రుతలూగించడానికి ముందుకు రాబోతున్నారు.

అలాగే స్థానిక సుప్రసిద్ధ డాన్స్ సమస్థలచే రెండు వందలకు పైగా కళాకారులచేత తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు, స్థానిక అమెరికన్ ప్రతినిథులు మరియు గౌరవ భారతీయ రాయబారి పాల్గొనబోతున్నారు. కాబట్టి మీరు అందరు మీ కుటుంబసభ్యులతో ఈ వేడుకకి హాజరు అయి విజయవంతం చేయాలి అని సాదరంగా మరొక్కసారి ఆహ్వానిస్తున్నాం అంటున్నారు గేట్స్ కార్యవర్గ మరియు బోర్డు సభ్యులు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected