Connect with us

Cultural

అంగరంగ వైభవంగా గేట్స్ తెలంగాణ సాంస్కృతిక దినోత్సవం, దశాబ్ది ఉత్సవాలు

Published

on

గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (GATeS) జూన్ 10న గ్యాస్ సౌత్ కన్వెన్షన్ సెంటర్‌లో తెలంగాణ సాంస్కృతిక దినోత్సవం, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా మహా సంప్రదాయ పద్ధతిలో తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలచే ప్రాంగణం పరిణమిల్లింది. ప్రాంగణాన్ని సుందరీకరించిన తీరు కన్నులపండుగగా నిలిచింది.

ముఖ్యంగా కాకతీయ తోరణం సమ్మక్క సారలమ్మ ఆలయం, అమ్మవారులు వేప చెట్టు కింద నెలకొల్పిన తీరు అందరిని పండగ సంబరాన్ని గుర్తు చేసింది. కార్యక్రమం మధ్యాహ్నం 3:00 గంటలకు గణేశ స్తోత్రంచే ప్రారంభమైంది. తర్వాత స్వస్థి మరియు స్నేహల్ బృందంచే భారతీయ మరియు అమెరికన్ జాతీయ గీతాల హృదయపూర్వక ప్రదర్శనలు జరిగాయి.

అనంతరం రాగం తాళం పల్లవి బృంద విద్యార్థులు దేశపతి శ్రీనివాస్ రాసిన “జయజయోస్తు తెలంగాణ జనని” పాటతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సుప్రీత డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు చంద్రబోస్ గారి ఐకానిక్ పాటలపై సమ్మిళిత నృత్య ప్రదర్శనను అందించారు. ఆ తర్వాత శృతిలయలు అకాడమీ నుండి ఆకర్షణీయమైన ప్రత్యక్ష గానం మరియు నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి.

తదనంతరం శ్రీ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థుల జానపద నృత్య ప్రదర్శన వేదికను అలరించింది. ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. GATeS కి మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ కాంస్య మరియు రజత స్పాన్సర్‌లను అధ్యక్షుడు జనార్దన్ పన్నెల మరియు చైర్మన్ శ్రీనివాస్ పర్సా సత్కరించారు.

ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ అకాడమీ తదుపరి వేదికపైకి వచ్చి హేమశిల్ప బృందం  వేములవాడ రాజన్న కథను  నృత్య ప్రదర్శన రూపంలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శన  ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్య అతిథి శ్రీ చంద్రబోస్ గారు మరియు గౌరవ అతిథి డా. స్వాతి కులకర్ణి గారు, టాడ్ జోన్స్, ఫోర్సిత్ కౌంటీ షెరీఫ్ రాన్ ఫ్రీమాన్, జాన్స్ క్రీక్  పోలీస్ చీఫ్ మార్క్ మిచెల్ మరియు జాన్స్ క్రీక్ సిటీ కౌన్సిల్ సభ్యుడు దిలీప్ తున్కి తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

GATeS అధ్యక్షులు  జనార్దన్ పన్నెల,  చైర్మన్ శ్రీనివాస్ పర్సా, GATeS బోర్డు సభ్యులు మరియు సలహా సభ్యులు జ్యోతి ప్రజ్వలన గావించారు. GATeS ప్రెసిడెంట్ జనార్దన్ పన్నెల తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకొని ఒక క్షణం మౌనం పాటించి, రాష్ట్ర గీతం “జయజయహే తెలంగాణ” పాటతో పాటతో ప్రేక్షకుల హృదయాన్ని కదిలించారు.

తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు పునఃప్రారంభమయ్యాయి. హౌస్ ఆఫ్ కల్చర్ బృందం శ్రీ చంద్రబోస్ గారి ఐకానిక్ పాటలకు చక్కటి  ప్రదర్శనలను అందించింది. GATeS గోల్డ్ స్పాన్సర్‌లను సత్కరించింది. వారి అమూల్యమైన సహకారాన్ని గుర్తించింది. మహిళలు, అన్న తమ్ముళ్లు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ముఖద్వారంలో ఏర్పాటు చేసిన కాకతీయ తోరణం, సమ్మక్క సారలమ్మ గద్దెలను ఏర్పాటుచేసిన తీరు అందరిని ఆకట్టుకుంది. దానితో పాటు వినూత్నమైన సాంస్కృతిక కార్యక్రమాలు మనసుల హృదయాలను హత్తుకున్నాయి. ప్రస్తుత GATeS ప్రెసిడెంట్ మరియు ఛైర్మన్ గేట్స్ సంస్థకు అందించిన సహకారాన్ని పూర్వ అధ్యక్షులను మరియు ఛైర్మన్‌లను సత్కరించారు.

పరాయి గ్రూప్ డప్పు అందించిన విన్యాసాలు పల్లె జ్ఞాపకాలను గుర్తుచేసింది. కమ్యూనిటీ కార్యక్రమాలకు నిరంతరం సహాయాన్ని అందిస్తున్న అంకితభావంతో పనిచేసే స్వచ్ఛంద సేవకులను అధ్యక్షుడు జనార్దన్ పన్నెల (Janardhan Pannela) అభినందించారు. అట్లాంటా నగరానికి వారి విశేషమైన సహకారాన్ని అందిస్తున్న స్వచ్ దేవాలయం ఫౌండర్ నటనటేశన్ను మరియు బాల నారాయణ ను సన్మానించారు.

షార్ట్ మూవీ నంది అవార్డు గ్రహీత శ్రీ ఫణి డొక్కా గారు మరియు సంగీత నాటక అకాడమీ మరియు బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార గ్రహీత వేదాంతం వెంకట గారిని సన్మానించారు. GATeS (Greater Atlanta Telangana Society) టీమ్ స్టెప్స్ ఛాలెంజ్లో ఎంపికైన వారికి  అవార్డ్‌లను అందచేశారు. సుమారు 300 వందలకు పైగా కళాకారులు పాల్గొన్నారు.

శ్రీ రాగదత్త అకాడమీ వారు ప్రదర్శించిన కొమురం భీమ్ జీవిత కథ స్కిట్, వారి అసాధారణ నైపుణ్యం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. అలాగే SID డ్యాన్స్ అకాడమీ “స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అవశ్యకతను ముఖ్యంగా తెలంగాణ విభజనకు ముందు తెలంగాణ వచ్చిన తరువాత ఎలా ఉంది అనే భావనను పాటల రూపంలో అందించిన తీరుకు ప్రేక్షకులకు కళ్ళు చెమ్మగిల్లాయి, అందరిని భావోద్వానికి గురిచేశాయి.

ప్రవీణ్ మాచవరం రచించిన “తెలంగాణ ఘన వైభవం” పాటను సాయి శ్రీనివాస్ స్వరపరచి, జనార్ధన్ పన్నెల మరియు సృష్టి చిల్లా ఆలపించారు. ఈ పాటలో గేట్స్ చేస్తున్న కార్యక్రమాలతో పాటుగా తెలంగాణ వైభవాన్ని, తెలంగాణ ఔన్నత్యాన్ని నీలిమ గడ్డమణుగు బృందం నృత్యరూపకము రూపంలో చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

GATeS ప్రెసిడెంట్ జనార్దన్ పన్నెల మరియు ఛైర్మన్ శ్రీనివాస్ పర్సా  స్పాన్సర్‌లందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే బోనాలు సంబరాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమనికి సంబందించిన ఏర్పాట్లను చేసిన బృందానికి ముఖ్యంగా గీతా నారన్నగారికి, రూప పన్నెల గారికి, సుమ కాసం గారికి  మరియు జ్యోత్స్న పాలకుర్తి గారికి ధన్యవాదాలు తెలిపారు.

GATeS బృందం, సలహాదారులు, ఈవెంట్ మరియు టైటిల్ స్పాన్సర్స్ అందరు కలిసి చంద్రబోస్ గారిని హిందూ టెంపుల్ అఫ్ అట్లాంటా పూజారి రవిశంకర్ బొగ్గరపు గారి ఆశీర్వచనాల మధ్య ఆస్కార్ అవార్డు గ్రహీత శ్రీ చంద్రబోస్ గారిని సత్కరించుకోవడం జరిగింది. తదనంతరం చంద్రబోస్ గారు ఆస్కార్ అవార్డు అందుకున్నప్పుడు కలిగిన అనుభవాలు అలాగే ఉదయభాను గారు అడిగిన ప్రశ్నలకి మాటల రూపంలో, పాటల రూపంలో అందించిన తీరు అమోఘం.

ఆతరువాత డైమండ్, ఈవెంట్ అండ్ టైటిల్ స్పాన్సర్స్ని సతి సమేతంగా  శ్రీచంద్రబొస్ గారు సత్కరించారు. ఈ సందర్బంగా అధ్యక్షులు జనార్దన్ పన్నెల గారు స్పాన్సర్స్ అందరికి  కృతజ్ఞతలు తెలియచేసారు. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు ఈ కార్యక్రమ వ్యాఖ్యాత  ఉదయభాను గారిని అభినందించి వారిని  సత్కరించారు.

తదుపరి సాకేత్, సుమంగళి, సృష్టి మరియు మెహర్ చంటి బృందంతో కూడిన కచేరీ ప్రేక్షకులను ఆహ్లాదపరిచింది. ఆతరువాత ధన్యవాదాలతో కార్యక్రమం రాత్రి 11:45 నిమిషాలకు ముగిసింది. GATeS నిర్వహించిన తెలంగాణ సాంస్కృతిక దినోత్సవం మరియు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం అద్భుత విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమం ప్రేక్షకులను తెలంగాణ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వంలో ముగ్ధులను చేసి, లీనమయ్యేలా చేసింది.

తెలుగు సంప్రదాయాలను పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందమైన థీమ్ ఆధారిత సాంస్కృతిక కార్యక్రమాలను అందించినందుకు జనార్ధన్ పన్నెల GATeS ప్రెసిడెంట్ కల్చరల్ టీమ్ కీర్తిధర్ గౌడ్ చెక్కిళ్ల, జ్యోత్స్న పాలకుర్తి మరియు గీతా నారన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు.

TAMA, GATA, TDF, IFA, ATA, TANA, NATA మరియు TTA సంస్థల నుండి హాజరైన ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియచేశారు. ఈ కార్యక్రమానికి GATeS బృందం గత మూడు నెలలుగా అపారమైన సమయన్ని వెచ్చించింది. అందరి కృషి వల్లే ఈ కార్యక్రమం  విజయవంతమైంది. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా భావించి, గొప్ప విజయాన్ని సాధించేందుకు చాలా నిస్వార్థంగా పని చేయడం వల్లనే ఇది సాధ్యమైంది. ఈ కార్యక్రమానికి సుమారు 1500-2000 మంది హాజరయ్యారు.

GATeS EC & BOD జనార్దన్ పన్నెల (అధ్యక్షుడు), శ్రీనివాస్ పర్స (చైర్మన్), సందీప్ గుండ్ల (వైస్ ప్రెసిడెంట్), నవీన్ బత్తిని (ప్రధాన కార్యదర్శి), రమణ గండ్ర (కోశాధికారి), కీర్తిధర్ గౌడ్ చెక్కిళ్ల (సాంస్కృతిక కార్యదర్శి), చలపతి వెన్నమనేని (ఈవెంట్ కార్యదర్శి), రఘువీర్ గడిపల్లి (క్రీడా కార్యదర్శి), నవీన్ వుజ్జిని (టెక్నాలజీ కార్యదర్శి), గణేష్ కాసం (మీడియా కార్యదర్శి), ప్రభాకర్ మడుపతి (డైరెక్టర్), రామాచారి నక్కర్తి (డైరెక్టర్), రామకృష్ణ గండ్ర (డైరెక్టర్), గీత నారన్నగారి (డైరెక్టర్), జ్యోత్స్న పాలకుర్తి (డైరెక్టర్) మరియు సలహాదారులందరికీ ధన్యవాదాలు.

డాక్టర్ శ్రీని గంగసాని, గౌతం గోలి, రత్నాకర్ రెడ్డి, డాక్టర్ సతీష్ చేటి, ప్రభాకర్ బోయపల్లి, కరుణాకర్ ఆసిరెడ్డి, కిరణ్ రెడ్డి పాశం, వెంకట్ వీరనేని, సృజన్ జోగినపల్లి, శ్రీధర్ నెలవెల్లి, నంద చాట్ల, నరేందర్ రెడ్డి, శ్రీధర్ జూలపల్లి, అనిల్ బొద్దిరెడ్డి, తిరుమల్ పిట్టా మరియు కమిటి చైర్స్, కోచైర్స్ మరియు స్వచ్ఛంద సేవకులందరూ నిరాటంకంగా శ్రమించి ఈ ఈవెంట్ ను చరిత్రలో నిలిచిపోయే విదంగా కృషి చేశారు.

మంచి భోజనాన్ని అందించిన బిర్యానీపాట్ రెస్టరెంట్ వారికి, ఆడియో వీడియో అందించిన డీజే టిల్లు గారికి, ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ అందించిన రఘు థర్డ్ ఐ, డెకొరేషన్ అందించిన ఏ ఆర్ డాజిల్ ఈవెంట్స్ అనూష గారికి, ప్రతి డాన్స్ అండ్ మ్యూజిక్ గురువులందరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected