Connect with us

Bathukamma

అక్టోబర్ 1న ఫౌలర్ పార్క్ లో గేట్స్ 17వ బతుకమ్మ, దసరా సంబురాలు: Cumming, Atlanta

Published

on

గత 17 సంవత్సరాలుగా బతుకమ్మ, దసరా సంబురాలను గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం కూడా అంతే ఘనంగా పెద్ద ఎత్తున బతుకమ్మ దసరా సంబురాలను అక్టోబర్ 1 శనివారం రోజున నిర్వహిస్తున్నారు.

సాఫ్ట్ పాత్ సిస్టం మరియు రెడ్డి సీపీఏ టైటిల్ స్పాన్సర్స్ గా వ్యవహరిస్తున్న ఈ గేట్స్ బతుకమ్మ, దసరా సంబురాలకు అందరికీ దగ్గిరగా, అనువుగా ఉండే కమ్మింగ్ నగరంలోని ఫౌలర్ పార్క్ వేదిక. గ్రూప్, సింగిల్ మరియు టీన్ కేటగిరీస్ బతుకమ్మ పోటీలలో బంపర్ ప్రైజస్ ఇవ్వనున్నారు.

బతుకమ్మ రెజిస్ట్రేషన్స్ కు https://tinyurl.com/gatesbathukamma, వెండర్ స్టాల్స్ కు https://www.gatesusa.org/donations/vendor-registration-form, ఈవెంట్ రెజిస్టర్ చేసుకోవడానికి ని http://evite.me/pmKemCjgy4 సందర్శించండి. మరిన్ని వివరాలకు ఫ్లయర్ ని చూడండి.

గౌరీ పూజ, జానపద పాటలు, నృత్యాలు, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగ భోజనం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కావలసినంత పార్కింగ్ అందునా చక్కని పార్క్ వాతారవరణంలో ఔట్డోర్ ఈవెంట్. కావున బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆ మహాతల్లిని భక్తి శ్రద్ధలతో సేవిద్దాం రండి అంటున్నారు సునీల్ గోటూర్ ఆధ్వర్యంలోని గేట్స్ 2022 కార్యవర్గం.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected