గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ (GATA) ఆధ్వర్యంలో మార్చి 28న DeSana Middle School లో నిర్వహించిన “ఉగాది ఉత్సవాలు 2026” అత్యంత వైభవంగా, సాంస్కృతిక ఉత్సాహంతో, కుటుంబ సమేతంగా పాల్గొన్న 1500 మంది ప్రేక్షకుల సందడి మధ్య ఘన విజయాన్ని సాధించింది.
సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సాగిన ఈ వేడుకలు తెలుగు సంప్రదాయం, ఆనందం, ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి. వేదికపై సంప్రదాయ అలంకరణలు, ఉగాది పచ్చడి ప్రతీకాత్మక షడ్రుచుల సమ్మేళనం, ఆనందడోలికల నడుమన ఉత్సవ వాతావరణం ఈ వేడుకలకు ప్రత్యేక శోభను చేకూర్చాయి.
కార్యక్రమాన్ని ఎమ్సీగా సౌజన్య, శిరీష, అనూజ చక్కటి చమత్కారంతో, ఉత్సాహభరితంగా నడిపిస్తూ ప్రేక్షకులను ఆహ్లాదపరిచారు. ఈ ఉత్సవాల్లో ప్రతి కార్యక్రమం ప్రేక్షకులను అలరించి విశేష స్పందనను పొందింది. ఉగాది (Ugadi) ఆరంభ వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి.
ఫణి డొక్కా (Phani Dokka) గారి శ్రవణానందకర పంచాంగ శ్రవణం, నయనానందకర కూచిపూడి, ఫోక్ డ్యాన్స్, సినీ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు వంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) అందరినీ ఆసాంతం అలరించాయి. పిల్లల ప్రతిభా ప్రదర్శనలు, చిన్నారుల ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతకు అద్భుత వేదిక గా నిలిచాయి ఈ GATA ఉత్సవాలు అనడంలో అతిశయోక్తి లేదు.
కుటుంబ వినోద కార్యక్రమాలు ప్రతి వయస్సువారిని ఆకట్టుకున్న సరదా ఆటలు, వెండర్ స్టాళ్లు (Shopping Stalls), ఆహారం, షాపింగ్, సాంస్కృతిక ఉత్పత్తులతో సరదాల సందడి నెలకొంది. Raffle మరియు బహుమతులు పాల్గొన్న వారిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి.
ఉగాది ఉత్సవాల (Ugadi Festival) సందర్భంగా విశిష్ఠ సేవలు, సామాజిక కృషి మరియు తెలుగు సమాజానికి చేసిన విశేష సేవలను గుర్తిస్తూ అందజేయడం ఆనవాయితీ గా ఈ ఏడాది కూడా ఉగాది పురస్కారాలను (Awards) ప్రముఖులకు ఘనంగా అందచేసింది GATA.
ఈ సందర్భంగా శ్రీ ఫణి డొక్క గారు, శ్రీమతి నీలిమ గడ్డమనుగు (Neelima Gaddamanugu)గారు, అలాగే డాక్టర్లు ఉదయ టాటా గారు మరియు సుధ టాటా గార్లకు ఉగాది పురస్కారాలు అందజేయడం జరిగింది. వివిధ రంగాలలో వారు చేసిన కృషి, సమాజంపై చూపిన ప్రభావం మరియు సేవా భావం ప్రశంసనీయమని నిర్వాహకులు అభినందించారు.
వేదికపై జరిగిన ఈ సత్కార కార్యక్రమం ప్రేక్షకుల చప్పట్ల మధ్య ఘనంగా సాగింది. పురస్కార గ్రహీతల సేవలను కొనియాడుతూ, భవిష్యత్తులో కూడా ఇలాగే సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే విధంగా మహాలక్ష్మీ అవతారాలతో, అద్భుత అలంకరణ మరియు ప్రతిభాపాటవాలతో ఉత్కంఠ భరితంగా సాగిన GATA మహాలక్ష్మి పోటీ అనూహ్య అభినందనలు కైవశం చేసుకుంది.
ఈ పోటీ కి సంబంధించిన ప్రత్యేక బహుమతులు – 1వ బహుమతి: 1 గ్రాము బంగారు నాణెం, 2వ బహుమతి: అందమైన పట్టు చీర, 3వ బహుమతి: ప్రాచీన నగలు గెలుచుకున్న వారు తమ హృదయపూర్వక హర్షాన్ని తెలియచేశారు. ఈ పోటీని నిర్వహించిన న్యాయ నిర్ణేతలు అంతర్జాతీయ పేజెంట్ విజేత అనుష్మితా బర్ధన్, గ్లోబల్ యాంకర్ కోమలి, ప్రముఖ గాయని రాగ వాహిని (Raaga Vahini) నిష్పక్షపాతంగా విజేతలను ప్రకటించడం అందరినీ ఆకట్టుకుంది.
ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన విలువైన స్పాన్సర్లు SplashBI, Tanishq లకు GATA ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.
Slice ‘N’ Spice అందించిన రుచికరమైన వంటకాలు సందర్శకుల మన్ననలు పొందాయి. ప్రతి వంటకం ఉగాది పండుగ ఆనందాన్ని మరింత పెంచింది.
ఈ సంద్భంగా GATA చైర్మన్ Sai Gorrepati, చీఫ్ కోఆర్డినేటర్ Subbareddy Kalakota ప్రసంగిస్తూ Board of Directors, కల్చరల్ టీమ్, వెండర్ కోఆర్డినేటర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, వాలంటీర్లు అందరూ సమన్వయంతో కృషి చేసి ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు.
వారి అంకితభావం ఈ కార్యక్రమానికి మూలస్తంభం మరియు అందరి సహకారం లేకుండా ఈ స్థాయి విజయాన్ని సాధించడం అసాధ్యం అంటూ అందరినీ ప్రత్యేకంగా కొనియాడడం ప్రశంసనీయం. ఈ “ఉగాది ఉత్సవాలు 2026” కార్యక్రమం తెలుగు సంస్కృతి, సంప్రదాయం, కుటుంబ విలువలను విదేశీ నేలపై మరింత గొప్పగా ప్రతిబింబించింది.
పాల్గొన్న ప్రతి ఒక్కరికీ Greater Atlanta Telugu Association (GATA) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. “GATA ఉగాది ఉత్సవాలు 2026” —సంస్కృతి, ఆనందం, ఐక్యత కలిసిన స్మరణీయ వేడుక అయ్యింది.