సనాతన ధర్మాన్ని పాటిస్తూ, హిందూమత విశ్వాసాలని అనుచరిస్తూ, హిందూ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించే హిందూ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంట ఆధ్వర్యంలో ఈ సంవత్సరం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దీనికి వేదికగా సువాని లోని పటేల్ బ్రదర్స్ ప్లాజా నిలిచింది.
10వ తేదిన మొదలైన గణేష్ నవరాత్రి వేడుకలు, గణేష్ హోమాలు, హోలీ, బాంగ్రా, దాండియా, ఉట్టి సంబరాలు, ప్రతీరోజు అర్చనలు, పూజలు పునస్కారాలతో అంగరంగ వైభవంగా జరగడం ఒక ఎత్తు అయితే, నిమజ్జనం వేడుకలకు సుమారు 1000 మందికి పైగా భక్తులతో 18వ తేది పటేల్ ప్లాజా మొత్తం కాషాయవర్ణంతో నిండడం మరో ఎత్తు. ఎక్కడ చూసిన జై గణేష, గణపతి బప్ప మోరియా అంటూ నినాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి.
అట్లాంటా ఇండియన్ కాన్సులేట్ జనరల్ శ్రీమతి డాక్టర్ స్వాతి విజయ కులకర్ణి గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. నిమజ్జన వేడుకలలో హెలికాప్టర్ తో పూలవర్షం భక్తులను అమితంగా ఆకర్షించింది. నవరాత్రులు అన్ని రోజులు ఉచిత ప్రసాదాన్ని అందించిన ఉత్సవ కమిటికి అభినందనలు.
అలాగే ఇంతటి మహత్కార్యాన్ని అందరూ అభినందించే విధంగా చేసి మన్నలలు అందుకొన్న ఉత్సవ కమిటీ నిర్వాహకులు నంద చాట్ల గారు (ఈవెంట్ కో-ఆర్డినేటర్), స్వప్న కారంబాక్కం (కల్చరల్ కమిటి కో-ఆర్డినేటర్), కవిత వీరబొమ్మన (పూజా కమిటి కో-ఆర్డినేటర్) మరియు వివిద కమిటి సభ్యులు అయిన మహేష్ కొప్పు, నవీన్ బత్తిని, రఘు రాచమల్లు, మనిక సింగ్, సంజీవ్కుమార్ ఎక్కలురి, యుగందర్ పొకాల, రాజెష్ బెల్డె, వివేక్ జపె, శ్యాం పింగలి, విజయ లీలా, ప్రశాంత్, వెంకట్, ఆనంద్, హరి కనికరం, నగేష్ హజారి, తనూజా జపె, రాజేష్ గుడిసేవ, శ్రీదేవి దడితోట తదితరులకు ప్రత్యక అభినందనలు.