Connect with us

Devotional

Cumming, Georgia: పోస్ట్ బ్రూక్ ఫార్మ్స్ లో ఆకట్టుకున్న గణేష్ ఉత్సవం

Published

on

అట్లాంటాలో కమ్మింగ్ నగరంలో గణేష్ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక పోస్ట్ బ్రూక్ ఫార్మ్స్ (Post Brook Farms) లో నిర్వహించిన ఈ గణేష్ ఉత్సవం సెప్టెంబర్ 18 మొదలుకొని సెప్టెంబర్ 23న నిమజ్జనంతో ముగిసింది. స్వామి వారి పూజా ప్రాంత అలంకరణ చక్కగా ఉంది.

వినాయక చవితి (Ganesh Chaturthi) సందర్భంగా మొదటి రోజు వినాయకుని ప్రతిష్టంచడం, ప్రతి రోజూ పూజలు, ప్రసాదాలు నిష్ఠగా చేశారు. పిల్లలకు ఆటలు, పాటల కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన నృత్య కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

చివరిరోజు గణేశుని (Lord Ganesh) కోలాహలంగా ఊరేగించి, అందరూ హారతి ఇచ్చారు. అనంతరం నిర్వహించిన వేలంపాటలో స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని 800 డాలర్లకు పాడారు. ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని పిల్లలు, పెద్దలు, మహిళలు ఇలా అందరూ ఆస్వాదించారు.

ఇండియాలో మాదిరి అందరూ తలకు బ్యాండ్లు కట్టుకొని వినాయకుని ఊరేగింపులో చిందులు వేశారు. చివరిగా వినాయకుని నిమజ్జనంతో ఈ సంవత్సర పోస్ట్ బ్రూక్ ఫార్మ్స్ (Post Brook Farms) గణేష్ ఉత్సవం విజయవంతంగా ముగిసింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected