Connect with us

Devotional

కమ్మింగ్ సేబ్రూక్ లో ఘనంగా గేణేష్ ఉత్సవాలు: Atlanta, Georgia

Published

on

కమ్మింగ్ (Cumming) నగరంలోని సేబ్రూక్ కమ్యూనిటిలో 2014 నుండి వినూత్నంగా ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాలు జరపడం ఆనవాయితి. 2023 చంద్రవాయాన్-3 విజయవంతంగా చందమామ దక్షిణ దృవంపై భారతదేశం (India) అడుగిడిన సందర్బాన్ని స్పూర్తిగా తీసుకొని చందమామపై విక్రం లేండర్, ప్రజ్ణాణ్ రోవర్ మరియు చంద్రయాన్-3 బ్యాక్ డ్రాప్ గా తీసుకొని అమెరికాలో అట్లాంటాలో భారతీయతను చాటిచెప్పిన సేబ్రూక్ కమ్యూనిటిని అభినందించాలి.

సెప్టెంబర్ 23 శనివారం ఉదయమే లోక కళ్యాణార్ధం జరిపిన గణేష్ (Lord Ganesh) హోమం ఆహుతులను విపరీతంగా ఆకర్షించింది. మధ్యాహ్న బోజనంలో సాంప్రదాయబద్దంగా భారతదేశ వివిద వంటకాల రుచులతో నోరూరించారు.

ఇంక సాయింత్రం గణేష్ నిమజ్జన మహోత్సవం లడ్డు వేలం పాట (Auction) తో ఉత్సాహపరిచింది. సతీష్ బిజినాపల్లి, రాజు (జెపి), ఫణి, రాజు నట్రాజ్ $1200 వందల డాలర్స్ పాట పాడి వాటిని ఫోర్సైత్ పోలిష్ వారికి విరాళంగా (Donation) ప్రకటించారు.

వెనువెంటనే ఉట్టి (Piñata) సంబరాలు వివిద కేటగిరిలో జరిగాయి. పిల్లలు, మహిళలు మరియు పురుషులు పాల్గొని అందరిని అలరించారు. ఇంక గణేష్ నిమజ్జన మహోత్సవాలు సుమారు రాత్రి 11 గంటల వరకు జరిగాయి.

కమ్మింగ్ (Cumming) నగరంలోని సేబ్రూక్ కమ్యూనిటి గేణేష్ ఉత్సవాల మరిన్ని ఫోటోలకు www.NRI2NRI.com/Saybrook Ganesh Chaturthi 2023 ని సందర్శించండి.