Connect with us

Devotional

Philadelphia: నాట్స్ ఆధ్వర్యంలో 1000 మందికి మహా ప్రసాదం @ గణేశ్ ఉత్సవాలు

Published

on

సెప్టెంబర్ 30, ఫిలడెల్ఫియా: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా ఫిలడెల్ఫియాలో గణేశ్ ఉత్సవాలను (Ganesh Chaturthi) ఘనంగా నిర్వహించింది.

ఫిలడెల్ఫియాలోని స్థానిక భారతీయ టెంపుల్‌లో గణేశ్ ఉత్సవాల్లో నాట్స్ నేను సైతం అంటూ పాల్గొని 1000 మందికి మహా ప్రసాదం పేరుతో భోజనాలు ఏర్పాటు చేసింది. నాట్స్ సభ్యులంతా కుటుంబసమేతంగా ఈ మహాప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి నాట్స్ సభ్యులంతా కృషి చేశారు.

ముఖ్యంగా దీప్తి, రామకృష్ణ గొర్రెపాటి, భార్గవి, రమణ రాకోతు, సునీత, లవ ఇనంపూడి, దీప, పార్ధ మాదల, కవిత ప్రకాష్ కురుకుండ, అంజు, విజయ్ వేమగిరి, దీక్ష, మధు కొల్లి, కమలజ, నిరంజన్ యనమండ్ర, మాలిని, శ్రీనివాస్ గట్టు, రాజ్యలక్ష్మి, సురేంద్ర కొరిటాల, బిందు, బాబు మేడి, సునీత, మధు బుదాటి, లావణ్య, సురేష్ బొందుగుల, కమల, రామ్ కొమ్మనబోయిన, సునీత, ప్రశాంత్ పసుపుల, అను, శ్రీనివాస్ దొంతినేని, భావన, రఘు సిరగవరపు, కవిత సతీష్ పుల్యపూడి, నీలిమ సుధాకర్ ఓలేటి, రాధిక మరియు హరి బుంగాటవుల, సుధ, శ్రీధర్ అప్పసాని తదితరులు కీలక పాత్ర పోషించారు.

నాట్స్ ఫిలడెల్ఫియా (Philadelphia) చాప్టర్ నాయకులంతా ఈ మహాప్రసాద కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తమ వంతు ఆర్థిక సహకారాన్ని అందించారు. ఫిలడెల్ఫియాలో తెలుగువారిని ఒక్కటి చేసేలా నాట్స్ నిర్వహించిన ఈ కార్యక్రమంపై నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి నాట్స్ ఫిలడెల్ఫియా నాయకులను ప్రశంసించారు.

పండుగల సమయంలో తెలుగువారి ఐక్యత చాటేలా మహాప్రసాదం కార్యక్రమం చేపట్టిన ఫిలడెల్ఫియా నాట్స్ (North America Telugu Society) విభాగాన్ని నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి (బాపు) నూతి ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected