మహాత్మాగాంధీ మునిమనవరాలు ఆశిష్ లత రాంగోబిన్‌కు దక్షిణాఫ్రికా కోర్టు జైలు శిక్ష విధించింది. దక్షిణాఫ్రికాలోని ఎన్జీవోకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఆమెకు ఛీటింగ్ కేసులో ఏడేళ్ల జైలు శిక్షని ఖరారుచేసింది. గాంధీజీ మనవరాలు, హక్కుల కార్యకర్త ఈలా గాంధీ కుమార్తె అయిన ఆశిష్ లత పర్యావరణ హక్కుల కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆశిష్ లత భారత్ నుంచి లినెన్ వస్త్రాలను తెప్పిస్తున్నాని, కస్టమ్స్ సుంకం కట్టకపోవడంతో పోర్టులోనే ఉండిపోయాయని చెప్పుకొన్నారు. ఆ మేరకు కొన్ని ఫోర్జరీ పత్రాలను సృష్టించి, వాటిని న్యూ ఆఫ్రికా అలెయెన్స్ ఫుట్‌వేర్ డైరెక్టర్ ఎస్‌ఆర్ మహారాజ్‌కు చూపించారు. ఆశిష్ లత కుటుంబ నేపథ్యంలో ఆమె అందజేసిన ఆధారాల మేరకు 3.34 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చారు. ఆ తర్వాత ఆమె చూపించిన పత్రాలు నకిలీవని మహారాజ్ గుర్తించి కేసు వేశారు. విచారణ జరిపిన డర్బన్ కోర్టు ఆశిష్ లతను దోషిగా తేలుస్తూ 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై అప్పీల్ చేసుకునే హక్కు కూడా లేదని ప్రకటించింది.