Connect with us

News

NATS ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ @ Pedanandipadu, Andhra Pradesh

Published

on

పెదనందిపాడు, 2024 మే 24: అమెరికాలో తెలుగువారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మహిళా సాధికారతకు చేయూత అందిస్తుంది. దీనిలో భాగంగా గుంటూరు జిల్లా (Guntur District) పెదనందిపాడు లోని తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రంలో నాట్స్ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లపై శిక్షణ ఇప్పించింది.

మహిళలు (Women) స్వశక్తితో ఎదగాలనే ఉద్దేశంతో మూడు నెలల కింద చేపట్టిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. మొదటి బ్యాచ్‌లో 23 మంది మహిళలకు కుట్టు శిక్షణ పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాట్స్ (NATS) అధ్యక్షుడు బాపయ్య చౌదరి (Bapu Nuthi) నూతి పాల్గొన్నారు.

నాట్స్ మహిళా సాధికారత (Women Empowerment) కోసం ఎప్పుడూ కృషి చేస్తుందని బాపు నూతి తెలిపారు. అమెరికాలో ఉంటున్నా, తన స్వంత గ్రామానికి ఎంతో కొంత సాయం చేయాలనే ఆకాంక్షతో బాపు నూతి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఇది నేటితరంలో స్ఫూర్తిని నింపే అంశమని ఎమ్మెల్సీ లక్ష్మణరావు (MLC Lakshmana Rao) అన్నారు.

కుట్టు శిక్షణ పూర్తి చేసిన వారికి ధ్రువ పత్రాలు అందించారు. నాట్స్ మహిళా సాధికారత (Women Empowerment) కోసం చేస్తున్న కృషిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి నాట్స్ (North America Telugu Society) చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prashanth Pinnamaneni) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected