హైదరాబాద్‌లో తానా (Telugu Association of North America), సిసిసి, స్వేచ్ఛ సంయుక్తంగా నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో 700 మందికి పైగా ఉచితంగా వైద్యసేవలందించారు. ఈ వైద్య శిబిరానికి శశికాంత్ వల్లేపల్లి, భార్య ప్రియాంక వల్లేపల్లి స్పాన్సర్లుగా వ్యవహరించారు.
మెగా వైద్యశిబిరాలకు వస్తున్న స్పందన, స్వేచ్ఛ వాలంటీర్లు అందిస్తున్న సేవలు చూసి శశికాంత్ వల్లేపల్లి (Sasikanth Vallepalli) అందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ క్యాంప్ కు గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లోని స్లమ్స్ నుంచి దాదాపు 7 వందలమంది హాజరయ్యారు.
వీరికి 13 మంది వైద్యులు కన్సలెన్సీ సేవలు అందించారు. హాజరైన పేషెంట్లు అందరికీ ఫ్రూట్స్ మరియు పులిహోర పంపిణీ చేశారు. స్వేచ్ఛ తరపున సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, బీటెక్ విద్యార్థులు, బ్యాంక్ ఉద్యోగులు ఇతర మేధావులు వలంటీర్లుగా హాజరై సేవలు అందించారు.
సిసిసి ప్రెసిడెంట్ చక్రధర్ మొత్తం క్యాంప్ ను పరిశీలించి, స్వేచ్ఛవారిని అభినందించారు. తాము కూడా ఇందులో భాగస్వాములైనందుకు గర్వపడుతున్నామన్నారు. ఈ మెడికల్ క్యాంప్ కోసం 26 మంది వైద్యుల బృందం పని చేస్తుంది. వీరంతా రొటేషన్ పద్ధతిలో హాజరవుతుంటారని తెలిపారు.
ఆర్ధోపెడిక్, డయాబెటీక్, గైనకాలజీ, పీడీయాట్రిషన్ ఇంకా ఇతర విభాగాలకు సంబంధించిన డాక్టర్లు కన్సల్టెన్సీ సేవలు అందించారు. పేషెంట్లు అందరికీ నెలకు సరిపడా మందులను ఉచితంగా అందించారు. ఈ క్యాంప్ లో రెగ్యులర్ గా కళ్లకు సంబంధించిన స్పెషలిస్ట్ సేవలు అందిస్తున్నారు.
ఇప్పటివరకు 140 మంది పేషెంట్లకు కాటరాక్ట్ (Cataract) ఆపరేషన్లు ఉచితంగా చేయించారు. వందలాదిమందికి ఉచితంగా కళ్లజోళ్లు అందించారు. విజయవంతంగా ఈ వైద్యశిబిరాన్ని నిర్వహించిన అందరినీ తానా (TANA) నాయకులు నిరంజన్ శృంగవరపు, అంజయ్య చౌదరి లావు, వెంకట రమణ యార్లగడ్డ అభినందించారు.