Connect with us

Health

Sakaar Narra & Family సహకారంతో గచ్చిబౌలిలో ఫ్రీ మెడికల్ క్యాంప్: స్వేచ్ఛ & తానా ఫౌండేషన్

Published

on

తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తానా (Telugu Association of North America) ఫౌండేషన్ మరియు స్వేచ్ఛ సంస్థ కలిపి ప్రతి నెలా మొదటి ఆదివారం ఉచిత మెడికల్ క్యాంప్ (Mega Free Health Camp) నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా జూన్ 2 ఆదివారం రోజున మరో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

సకార్ నర్రా కుటుంబం (Sakaar Narra & Family) స్పాన్సర్ చేసిన ఈ ఉచిత మెడికల్ క్యాంప్ లో 500 మందికి పైగా ఉచితంగా వైద్యసేవలందించారు. మెగా వైద్య శిబిరాలకు వస్తున్న స్పందన, స్వేచ్ఛ వాలంటీర్లు అందిస్తున్న సహకారం, సేవలకు గాను తానా (Telugu Association of North America) ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్‌ వల్లేపల్లి అందరినీ అభినందించారు.

హైదరాబాద్ లోని గచ్చిబౌలి (Gachibowli), శేరిలింగంపల్లి, మియాపూర్‌ తదితర ప్రాంతాల్లోని స్లమ్స్‌ నుంచి వచ్చిన పేదలు నిన్న నిర్వహించిన ఈ క్యాంప్‌ సేవలను వినియోగించుకున్నారు. ఈ మెడికల్‌ క్యాంప్‌ (Mega Free Health Camp) కోసం ప్రత్యేక వైద్యుల బృందం పని చేస్తుంది. వీరంతా రొటేషన్‌ పద్ధతిలో హాజరవుతుంటారని తెలిపారు.

ఆర్ధోపెడిక్‌, డయాబెటీక్‌, గైనకాలజీ, పీడీయాట్రిషన్‌, డయాబెటిక్, జనరల్ మెడిసిన్, కంటి వైద్యం తదితర విభాగాలకు సంబంధించిన స్పెషలిస్ట్‌ డాక్టర్లు కన్సల్టెన్సీ సేవలు అందించారు. పేషెంట్లు అందరికీ 30 రోజులకు సరిపడా మందులను (Medicine) ఉచితంగా అందించారు. తానా ఫౌండేషన్ (TANA Foundation) ట్రస్టీ శ్రీనివాస్ ఎండూరి ఈ ప్రాజెక్ట్ కి సమన్వయకర్తగా వ్యవహరించారు.

తానా ఫౌండేషన్ (TANA Foundation) తరపున సంస్థ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి (Sasikanth Vallepalli) ఈ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహణను పర్యవేక్షించారు. విజయవంతంగా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించిన అందరినీ తానా అధ్యక్షులు నిరంజన్‌ శృంగవరపు (Niranjan Srungavarapu) అభినందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected