తోటి తెలుగువారికి అండగా నిలవాలన్న తపన, నిస్వార్థ సేవాభావంతో పనిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్… తాజాగా సెయింట్ లూయిస్ (St. Louis, Missouri) లో ‘ఉచిత వైద్య శిబిరం’ నిర్వహించింది. మిస్సోరీ నాట్స్ విభాగం (NATS Missouri Chapter) నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరం నాట్స్ సేవా నిరతిని చాటింది.
ఈ వైద్య శిబిరానికి నాట్స్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ అట్లూరి (Dr. Sudheer Atluri) తమ వృత్తిపరమైన బాధ్యతను సేవా దృక్పథంతో జోడించి విశేష సేవలందించారు. శిబిరానికి వచ్చిన రోగులను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి ఆరోగ్య సమస్యలను ఓపికగా విని, తగిన వైద్య పరీక్షలు నిర్వహించి సరైన సూచనలు అందించారు.
ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడంలో నాట్స్ (NATS) నాయకత్వం అడుగడుగునా సహకారం అందించింది. నాట్స్ ప్రస్తుత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రమేష్ బెల్లం, నాట్స్ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి, మిస్సౌరీ చాప్టర్ కోఆర్డినేటర్ సందీప్ కొల్లిపర (Sandeep Kollipara) గారు దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.
వారు నాట్స్ నాయకులుగా మాత్రమే కాకుండా, సామాన్య సేవకులుగా అందించిన సహకారం ఈ వైద్య శిబిరాన్ని విజయవంతం అయ్యేలా చేసింది. నాట్స్ (North America Telugu Society – NATS) నాయకులతో పాటు స్థానిక వాలంటీర్లు కూడా ఈ వైద్య శిబిరంలో ఉత్సాహంగా సేవలు అందించారు.
తోటివారి కోసం సమయాన్ని, శ్రమను వెచ్చించి నాట్స్ (North America Telugu Society – NATS) చేసిన ఈ నిస్వార్థ సేవకు స్థానికుల నుంచి ప్రశంసలు లభించాయి. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలతో నాట్స్ తమ సేవా ప్రయాణాన్ని కొనసాగించాలని పలువురు ఆకాంక్షించారు.
నాట్స్ మిస్సోరీ (NATS Missouri Chapter) ఉచిత వైద్య శిబిరం (Free Health Camp) లో నిర్వహణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల (Kishore Kancharla), నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందడి (Srihari Mandadi) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.