St. Louis, Missouri, January 20, 2025: అమెరికాలో తెలుగువారి కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (North America Telugu Society – NATS) తాజాగా మిస్సోరీలో సెయింట్ లూయిస్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది.
స్థానిక మహాత్మా గాంధీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్నిస్థానిక తెలుగు వారితో పాటు పలువురు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ బాపూజీ దర్శి (Internal Medicine), డాక్టర్ శేఖర్ వంగల (Psychiatrist) రోగులకు వైద్య సేవలు అందించారు.
రోగుల ఆరోగ్య సమస్యలను నిశితంగా పరిశీలించిన వైద్యులు, వారికి అవసరమైన పలు రకాల వైద్య పరీక్షలను కూడా నిర్వహించారు. సమాజ సేవలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సహకరించిన వాలంటీర్లకు, నాట్స్ (NATS) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు నాట్స్ మిస్సోరీ చాప్టర్ కోఆర్డినేటర్ సందీప్ కొల్లిపర (Sandeep Kollipara) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు మిస్సోరీలో నాట్స్ (NATS) చేపడుతుందని తెలిపారు. ప్రతి నెల మిస్సోరీలో వైద్య శిబిరం నిర్వహిస్తున్న వైద్యులను, మిస్సోరీ నాట్స్ నాయకులను నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల (Kishore Kancharla), నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందడి (Srihari Mandadi) ప్రత్యేకంగా అభినందించారు.