Alpharetta, Georgia, September 27, 2025: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) కార్యాలయ ప్రాంగణంలో, వాల్ గ్రీన్స్ (Walgreens Pharmacy) సహకారంతో ఉచిత ఫ్లూ టీకా/వాక్సిన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తామా బృందం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం సూచించిన అన్నిమార్గదర్శకాలతో అమలు చేసింది.
ముందస్తుగా 100 మందికి పైగా నమోదు చేసుకోవడం, మరియు 3 సంవత్సరాల నుండి 85 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవడంవిశేషం. ఫార్మసిస్ట్‌లైన (Pharmacists) మితేష్ పటేల్, సూర్య వంగపండు మరియు స్మృతి ఘాగ్ గారు వచ్చిన వారందరికీ ఫ్లూవాక్సిన్ అందజేశారు.
శీతాకాలంలో (Winter Season) వచ్చే విషజ్వరాల నుండి కాపాడటమే కాకుండా, సమయం మరియు వ్యయాన్ని ఆదా చేసే ఈ టీకాల ప్రాముఖ్యతను వైద్యులు వివరించారు. యువ వాలంటీర్లు కూడా ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో విశేష సహకారం అందించారు. వచ్చిన వారికి చిరుతిండి మరియు పానీయాలు ఏర్పాటు చేయడం జరిగింది.
పాల్గొన్న TAMA నాయకులు
- చైర్మన్: రాఘవ తడవర్తి
- అధ్యక్షులు: రూపేందర్ వేములపల్లి
- ప్రెసిడెంట్ ఎలెక్ట్: సునీత పొట్నూరు
- కోశాధికారి: సునీల్ దేవరపల్లి
- సాంస్కృతిక కార్యదర్శి: సత్యనాగేందర్ గుత్తుల
- సాంకేతిక కార్యదర్శి: చలమయ్య బచ్చు
- సాహిత్య కార్యదర్శి: శ్రీనివాస్ రామనాధం
- కమ్యూనిటీ కార్యదర్శి: కృష్ణ ఇనపకుతిక
- ఈవెంట్ కార్యదర్శి: శేఖర్ కొల్లు
- విద్యా కార్యదర్శి: ముఖర్జీ వేములపల్లి
- మహిళా కార్యదర్శి: పార్వతి కొంపెల్ల
బోర్డు సభ్యులు: యశ్వంత్ జొన్నలగడ్డ, రవి కల్లి, ప్రియా బలుసు, వెంకట్ మీసాల, సాయిరాం కారుమంచి, నగేష్ దొడ్డాక, రాంకీ చౌడారపు.
ఈ సందర్భంగా తామా (Telugu Association of Metro Atlanta – TAMA) శ్రేయోభిలాషులు అందరూ హాజరై కార్యక్రమాన్ని శుభప్రదం చేశారు.
విరాళాల ఆహ్వానం
ప్రజల ఆరోగ్యం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కొనసాగించడానికి దాతల సహకారం అత్యవసరం. విరాళాలు అందజేయుటకు దయచేసి తామా (Telugu Association of Metro Atlanta – TAMA) వెబ్‌సైట్ www.tama.org ను సందర్శించండి.