St. Louis, Missouri: ‘సమాజ సేవలో మేము సైతం’ అంటూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మిస్సోరీ విభాగం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే సెయింట్ లూయిస్ (St. Louis, Missouri) లోని మహాత్మా గాంధీ సెంటర్‌లో ఉచిత వైద్య శిబిరం, ఉచిత ఫ్లూ టీకా కార్యక్రమం నిర్వహించారు.
ఈ ఉచిత వైద్య శిబిరం ఎంతో మంది తెలుగువారితో పాటు స్థానికులకు కూడా ఉపయోగపడింది. ఈ వైద్య శిబిరంలో రోగులకు నాట్స్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ అట్లూరి (Sudheer Atluri) స్వచ్ఛందంగా వైద్య సేవలు అందించారు. ఫ్లూ టీకా (Flu Shots) లను ఉచితంగా అందించడంలోడాక్టర్ ఏజే కీలక పాత్ర పోషించారు.
నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రమేష్ బెల్లం (Ramesh Bellam), నాట్స్ మాజీ అధ్యక్షుడు ప్రస్తుత నాట్స్ బోర్డ్ సభ్యులు సభ్యులు శ్రీనివాస్ మంచికలపూడి (Srinivas Manchikalapudi), నాట్స్ మిస్సౌరీ విభాగం కో-ఆర్డినేటర్ సందీప్ కొల్లిపార, జాయింట్ కో-ఆర్డినేటర్ అన్వేష్ చాపరాల, నాగ శ్రీనివాస్ శిస్ట్ల తదితరులతో పాటు వాలంటీర్లు ఈ ఉచిత వైద్య శిబిరం కోసం తమ విలువైన సమయాన్ని, సేవలను అందించారు.
ఈ ఉచిత వైద్య శిబిరంలో ఉచిత వైద్య పరీక్షల కోసం, ఫ్లూ టీకాలు తీసుకోవడం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ శిబిరానికి హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు. టీకాలు వేయించుకున్నారు. మిస్సోరీ (St. Louis, Missouri) లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందడి ప్రత్యేకంగా అభినందించారు.