Connect with us

News

న్యూయార్క్ లో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కి ఘన స్వాగతం

Published

on

న్యూయార్క్, అమెరికా: తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) సభల్లో పాల్గొనేందుకు అమెరికా వచ్చిన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Muppavarapu Venkaiah Naidu) గారికి ఘనస్వాగతం లభించింది.

ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు జరిగే తానా సభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా న్యూయార్క్ లోని జేఎఫ్ కే విమానాశ్రయానికి వచ్చిన వెంకయ్యనాయుడు గారికి ఘనస్వాగతం పలికారు.

తానా డైరెక్టర్ వంశీ కోట (Vamsi Kota) ఆధ్వర్యంలోని తానా (Telugu Association of North America) ప్రతినిధి బృందం, మరికొంతమంది ప్రముఖులు విమానాశ్రయానికి తరలివచ్చి ఆయనకు స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో మన్నవ సుబ్బారావు, పాతూరి నాగభూషణం, గోరంట్ల పున్నయ్య చౌదరి, సామినేని కోటేశ్వరరావు, గంటా పున్నారావు, రాము కోట, రవి రావి, సుబ్రహ్మణ్యం, ప్రసాద్ చుక్కపల్లి, యలమంచిలి జగదీష్, సుబ్రహ్మణ్యం ఓసూరు, క్రాంతి ఆలపాటి, ప్రస్తుత కాన్సూల్ జనరల్ డా. వరుణ్ జెఫ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected