Raleigh, North Carolina, November 27: భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా నార్త్ కరోలినా (North Carolina) లో సేవా కార్యక్రమాల్లో భాగంగా ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది.
నాట్స్ సభ్యులు వెంకట్ రావు దగ్గుబాటి, రాజేష్ మన్నేపల్లి, ఉమాశంకర్ నార్నే, కల్పన అధికారి, రవితేజ కాజ, ఇంకా వాలంటీర్లు, తెలుగు కుటుంబాలు ఈ ఫుడ్ర డ్రైవ్‌లో ఆహారాన్ని విరాళంగా అందించాయి. నాట్స్ నార్త్ కరోలినా టీం (NATS North Carolina Chapter) సేకరించిన 1000 పౌండ్లకు పైగా బరువైన ఆహారాన్ని దుర్హం రెస్కూ మిషన్ (Durham Rescue Mission) నిరాశ్రయులకు నాట్స్ అందించింది.
నార్త్ కరోలినా (North Carolina) లో తొలిసారిగా నాట్స్ ఈ ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది. విద్యార్ధుల్లో సేవా భావాన్ని పెంచడం.. భావితరాల్లో కష్టాల్లో ఉన్న సాటి వారిని ఆదుకునే తత్వాన్ని తమ చర్యల వల్ల బోధించడం ఈ ఫుడ్ డ్రైవ్ (Food Donation Drive) యొక్క అంతరార్ధం.
అమెరికాలో ఓ సంప్రదాయంలా నిర్వహించే థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని ఈ ఫుడ్ డ్రైవ్ (Food Drive) ద్వారా నాట్స్ చేపట్టింది. ఈ ఫుడ్ డ్రైవ్‌లో పాల్గొన్న నాట్స్ (North America Telugu Society) టీం సభ్యులకు, దాతలకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని మరియు నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.