Connect with us

Food

Birmingham, Alabama:పేదవాడికి పట్టెడు అన్నం అన్న NTR స్ఫూర్తిగా అన్నదానం

Published

on

అమెరికాలోని అలబామా రాష్ట్రం (Alabama), బర్మింగ్హామ్ (Birmingham) నగరంలో స్వర్గీయ విశ్వ విఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు (NTR) గారి 101వ జయంతి ఉత్సవాలని జూన్ 30, ఆదివారం రోజున ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా, “పేదవాడికి పట్టెడు అన్నం” అని చెప్పిన శ్రీ నందమూరి తారక రామారావు గారి స్పూర్తితో 70 మంది నిరాశ్రయులకి (Homeless) భోజనాన్ని స్వయంగా వండి వడ్డిచ్చారు. ప్రతి సంవత్సరం ఈ ఆనవాయితీ కొనసాగించడం అభినందనీయం.

Jimmy Hale Mission లో ముందుగా ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించారు. జోహార్ ఎన్టీఆర్ (NTR), ఎన్టీఆర్ అమర్ రహే అంటూ అభిమానులు నినాదాలు చేశారు. ప్రవాసులలో పెద్దలు, పిల్లలు సైతం పాల్గొనడం విశేషం.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected