Connect with us

Singing

జానపదాన్ని జ్ఞానపథంగా నమ్ముకున్న జనార్ధన్; ఆటిజం, మానసిక వికలాంగులకు సేవలు

Published

on

మట్టివాసనని గట్టిగా అలుముకున్న
జానపదాన్ని జ్ఞానపథంగా నమ్ముకున్న
అసలుసిసలైన ప్రజాగాయకుడు జనార్ధన్
జార్జియా జానపద జనార్ధన్ గా ఖ్యాతి

రెండు దశాబ్దాలుగా ఆటిజం (Autism), మానసిక వికలాంగులకు సేవలలందిస్తూ సేవాతత్పరతతో సంపాదిస్తున్నదాంట్లో కొంత తాను ఇండియాలో నడుపుతున్న శాంతినికేతన్ ఫౌండేషన్ (Shantiniketan Foundation) కోసం ఖర్చు చేస్తూనే తనకు చిన్నప్పటినుండి అబ్బిన పాటల నేర్పరితనంను పదిలంగా కాపాడుకుంటూ జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద గాయకునిగా తనదైన ముద్రవేసుకుంటూ మనందరి జనార్ధన్ “జార్జియా జానపద జనార్ధన్”గా పేరు తెచ్చుకున్నారు.

గత సంవత్సరం గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (Greater Atlanta Telangana Society – GATeS) కు ప్రెసిడెంట్ గా సేవలు అందించారు. జానపదాన్ని (Folk) జోర్దారుగా వేదికలమీద వినిపించడంలో జనార్ధన్ బాణీయే వేరు. అమెరికా అంతటా వివిధ తెలుగు, తెలంగాణ (Telangana) వేదికల మీద సంగీత ప్రదర్శనలు ఇస్తూనే, అత్యంత ఉత్సాహంతో వివిధ పండుగలకు మరియు వేడుకలకు ప్రత్యేక పాటలకు రూపకల్పన చేస్తున్నారు.

గత సంవత్సరం తెలంగాణ అవతరణ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా “తెలంగాణం” అనే ఒక మ్యూజికల్ డాన్స్ బ్యాలే, గణేష్ నవరాత్రుల సందర్భంగా “గం గం గణనాథ” అనే పాట, బతుకమ్మ సీజన్ లో “సక్కాసక్కని పూల సుక్కా” అనే పాటకు జనార్ధన్ (Janardhan Pannela) ప్రాణం పోశారు.

“గం గం గణనాథ” పాట ఆస్కార్ అవార్డు గ్రహీత డా. చంద్రబోసు (Kanukuntla Subhash Chandrabose, Oscar Awardee) గారి చేతులమీదుగా లాంచ్ చేయబడింది. వారు ఆ పాటని ఏంతో మెచ్చుకోవడం జరిగింది. అలాగే జనార్ధన్ పాటలు ప్రముఖ సినీసంగీత దర్శకులు మణిశర్మ (Mani Sharma, Tollywood Music Director) లాంటి వారి ప్రశంసలు అందుకోవడం జరిగింది.

“సక్కాసక్కని పూల సుక్కా” అనే పాట యూటూబ్ లో గత బతుకమ్మ సీజన్ లో 1 మిలియన్ వ్యూస్ ను దాటి సెన్సేషన్ గా మారింది. అంతే కాకుండా తాను పాడిన “అల్లో నేరేళ్లో”, శాంతినికేతన్ ఫౌండేషన్ (Shantiniketan Foundation) థీమ్ సాంగ్, లాంటి ఎన్నో పాటలు తన గొంతునుండి జాలువారడం జరిగింది. జానపద గీతాలే (Folk Songs) కాకుండా, సినిమా పాటలు పాడడంలో కూడా జనార్ధన్ కు మంచి ప్రావీణ్యం ఉంది.

2017 లో పాటల రచయిత డా. చంద్రబోసు రాసిన అల్లో నేరేళ్లో.. అల్లో నేరేళ్లో.. బతుకమ్మ పాటను అట్లాంటా (Atlanta) పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించి ఉత్తర అమెరికా (North America) లోనే మొట్టమొదటిసారిగా ఆలపించారు. దీనికి నిర్మాతగా కిరణ్ రెడ్డి పాశం, కొరియోగ్రాఫర్ గా నీలిమ గడ్డమణుగు, సంగీత దర్శకునిగా సురేష్ బొబ్బిలి వ్యవహరించారు.

సెలయేటి పక్కన సేదతీరుతున్నట్టు జనార్ధన్ (Janardhan Pannela) మరియు RNR బృందంచే గత వారాంతం నిర్వహించిన పాటల ధూందాం “ఫోక్ ఫ్యూజన్” తో అందరిని అలరించారు. గుండెలోని మంచితనాన్ని గొంతులో ఒంపుకుని, మనందరికి వీనులవిందు చేసేలా జనార్ధన్ పాటల ప్రస్థానం కలకాలం కొనసాగుతుందని మనమంతా ఆశిద్దాం.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected