Connect with us

News

TANA కార్యదర్శి రాజా కసుకుర్తి కి ఆత్మీయ సత్కారం, సేవలను కొనియాడిన రంగన్నగూడెం వాసులు

Published

on

అమెరికాలో అతిపెద్ద తెలుగు సంఘం అయిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America – TANA) కార్యదర్శిగా కృష్ణా జిల్లా వీరవల్లి గ్రామానికి చెందిన రాజా కసుకుర్తి ఇటీవల జరిగిన ఎన్నికల్లో 2023-2025 సంవత్సరానికి గానూ భారీ మెజారిటీతో ఎన్నిక కావడం జరిగింది.

తానా కార్యదర్శిగా ఎన్నికైన తరువాత తమ స్వగ్రామానికి విచ్చేసిన సందర్భంగా ఈరోజు సాయంత్రం రంగన్నగూడెం గ్రామం కమ్యూనిటీ హాల్ లో రంగన్న గూడెం (Ranganna Gudem, Andhra Pradesh) రూరల్ డెవలప్మెంట్ సొసైటీ (ఆర్.అర్. డీ.ఎస్) ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజాప్రతినిధులు రాజా కసుకుర్తి (Raja Kasukurthi) కి ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా రంగన్నగూడెం (Ranganna Gudem) రూరల్ డెవలప్మెంట్ సొసైటీ కార్యదర్శి, సాగునీటి వినియోగదైరుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించి రాజా కసుకుర్తిని పూలమాలలు వేసి, దృశ్యాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందజేసి, హనుమాన్ దేవాలయం చిత్రపటాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ… గత పది సంవత్సరాలుగా తానా (TANA) లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తానా కోఆర్డినేటర్ గా, రీజనల్ కోఆర్డినేటర్ గా పలు పదవులు నిర్వహించి అమెరికాలో తెలుగు విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో తానా చైతన్య స్రవంతి కార్యక్రమం ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాలు, విద్యార్థులకు ఉపకార వేతనాలు, పేదవారికి రగ్గులు, రైతులకు ఉచిత వ్యవసాయ రక్షణ కిట్లు అందజేయటం వంటి పలు సేవా కార్యక్రమాలు చేయడం ఆయన సేవ తత్పరతకు నిదర్శనం అన్నారు.

సత్కారం అందుకున్న తానా కార్యదర్శి రాజా కసుకుర్తి మాట్లాడుతూ… ఒక రైతు బిడ్డగా రాబోయే రెండు సంవత్సరాలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) రైతులకు ఉచిత వైద్య శిబిరాలు, అవసరమైన వ్యవసాయ పనిముట్లకు ప్రాధాన్యత నిచ్చి అవసరమైన సేవా కార్యక్రమాలు ముమ్మరం చేస్తానని తెలియజేశారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women’s Day) సందర్భంగా గ్రామ మహిళా సర్పంచ్ కసుకుర్తి రంగా మణి నీ తానా కార్యదర్శి రాజా కసుకుర్తి చేతులమీదుగా గ్రామ ప్రజా ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆర్.అర్.డీ.ఎస్ అధ్యక్షులు తుమ్మల దశరథ రామయ్య, రంగన్నగూడెం గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగామణి, ఎం.పీ.టీ.సీ సభ్యులు పసులూరు లక్ష్మీనారాయణ, ఎం.పీ.సీ.ఎస్ అధ్యక్షులు మొవ్వ శ్రీనివాసరావు, గ్రామ ప్రముఖులు కసుకుర్తి వెంకట నరసింహారావు, పుసులూరు పూర్ణ వెంకటప్రసాద్, దోనవల్లి శ్రీహరి, మొవ్వ వేణుగోపాల్, కనకవల్లి శేషగిరిరావు, కసుకుర్తి వేణు బాబు, తుమ్మల వెంకటేశ్వర రావు, మొక్కపాటి సత్యనారాయణ, కొలుసు గంగా జలం, ఆళ్ళ గురవయ్య, కసుకుర్తి వెంకట శాస్త్రులు, ఆలపాటి శ్రీనివాసరావు, మందపాటి రాంబాబు, లంకా సత్యనారాయణ, మొవ్వా కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected