Connect with us

News

Andhra Pradesh Science & Technology Academy ఛైర్మన్ రవి మందలపు కు ఘన సన్మానం⁠ @ New Jersey

Published

on

New Jersey: “టెక్నాలజీ పెరిగి పోవడంతో.. ప్రపంచం దగ్గరయింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నాం. ప్రతి కొత్త టెక్నాలజీ నూతన అవకాశాలను సృష్టిస్తూ, మానవ జీవితాలను మార్చేస్తోంది. ఏఐ మానవ మేథస్సును సవాల్ చేస్తోంది. వీటన్నింటిని అందిపుచ్చుకొని రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలి” అని ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమి ఛైర్మన్ రవి మందలపు (Ravi Mandalapu) అన్నారు.

అమెరికాలోని న్యూ జెర్సీలో ప్రవాసాంధ్రులు ఆయనను (Ravi Mandalapu) ఘనంగా సన్మానించారు. జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్టీఆర్ (NTR) విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుంటూరు మిర్చీ యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు (Mannava Subbarao) పాల్గొన్నారు. దేశంలోనే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఏపీని రవి మందలపు ముందువరుసలో ఉంచుతారని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు.

ఏపీ (Andhra Pradesh) లో జరిగే నూతన ఆవిష్కరణలు రేపటి తరాలకు మార్గదర్శకమౌతాయని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతిభా పాటవాలు, ఉన్నత విద్యావంతులైన యువతకు కొదవ లేదన్నారు. వారిని ప్రోత్సహించే గొప్ప నాయకత్వ లక్షణాలున్న చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ముఖ్యమంత్రిగా ఉండటం అదృష్టమని కొనియాడారు.

రవి మందలపు మాట్లాడుతూ… రేపటి విజేతలుగా నిలవాలంటే.. ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్ళను, వేగంగా మారుతున్న సాoకేతికతను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా సంపద సృష్టించి రాష్ట్రంలో, దేశంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపాలి. ప్రతిభను ప్రోత్సహిస్తూ సరైన దిశలో యువతను చంద్రబాబు (Nara Chandrababu Naidu) ముందుకు తీసుకెళ్తున్నారు అన్నారు.

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ… “ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అపారమైన సహజసంపద, మానవవనరులున్నాయి. ప్రతిభావంతులైన, సృజనాత్మకత కలిగిన యువతకు సరైన వేదిక లభిస్తే… వారు ప్రపంచంలోనే ముందువరుసలో ఉంటారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందువరుసలో ఆంధ్రప్రదేశ్ ఉంది” అని అన్నారు.

ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస్ భీమినేని (Srinivas Bhimineni), శ్రీనాథ్ రావుల తదితరులు సమన్వయపరిచారు. ఈ కార్యక్రమం లో శ్రీధర్ చిల్లర (Sridhar Chillara), తెలుగు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. సుమారు వెయ్యి మంది ప్రవాసాంధ్రులు హాజరయ్యారు.

error: NRI2NRI.COM copyright content is protected