నారా చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంతమొందించడానికి వైసిపి (YSR Congress Party) ప్రభుత్వం కుట్ర పన్నుతుందని, ఈ మేరకు ప్రజల నుంచి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సీనియర్ నేతలు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి కుర్రా నరేంద్ర తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదే విషయమై ఈరోజు ఉదయం విజయవాడలోని ఆటోనగర్ లో ఉన్న కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ.. చంద్రబాబు (Nara Chandrababu Naidu) కు జైల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా కక్షపూరితంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, చంద్రబాబు అధికారంలో ఉన్నంతవరకు ఆయన విలువ ఎవరికి తెలియలేదని ఈ మూర్ఖత్వ వైసిపి (YCP) ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు ఎంత సమర్ధుడు అన్నది ప్రతి ఒక్కరికి అర్థం అయిందని అన్నారు.
చంద్రబాబు నాయుడు అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజల ఆస్తి అని ఆయనకు ఏదైనా ముప్పు వాటిలితే ఈ రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చంద్రబాబు అరెస్టుపై ప్రజలు తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నారని, బుధవారం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆయన విడుదల కావడం ఖాయం అని ఆళ్ళ (Alla Venkata Gopala Krishna Rao) ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి కుర్రా నరేంద్ర మాట్లాడుతూ.. చంద్రబాబు బరువు తగ్గటం ఆందోళన చెందాల్సిన అవసరం అని ఆయనకు వెంటనే వైద్యుల పర్యవేక్షణలో వైద్యం అందించకపోతే ఆరోగ్యం పూర్తిగా క్షణించే ప్రమాదం ఉందని చంద్రబాబు ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేర్పించాలని రాష్ట్ర ప్రభత్వాన్ని డిమాండ్ చేశారు. డీ హైడ్రేషన్ బారిన పడిన చంద్ర బాబుని చల్లని వాతావరణం లో పెట్టాలన్న వైద్యుల సూచనలను ఎందు అమలు చేయలేదని ప్రశ్నించారు. వైద్యులు సూచనలు అమలు చేయాల్సిన బాధ్యత జైలు అధికారులకు లేదా అని నిలదీశారు.