Connect with us

News

TANA నూతన కార్యవర్గానికి మాజీ ఉపరాష్ట్రపతి Venkaiah Naidu శుభాకాంక్షలు

Published

on

తానా నూతన కార్యవర్గానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన తానా ఎన్నికల్లో (TANA Elections) కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా విజయం సాధించిన నరేన్ కొడాలి (Naren Kodali) మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి (Ravi Potluri) లకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

అభిప్రాయభేదాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని తెలుగుభాష, సంస్కృతి కోసం తానా చేస్తున్న సేవలు మరింత విస్తృతం చేయాలని వెంకయ్య నాయుడు (Muppavarapu Venkaiah Naidu) తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తానా (Telugu Association of North America) అందిస్తున్న సేవలు అభినందనీయమని, అందరు కలిసిమెలిసి ఐకమత్యంతో మెలిగి తెలుగు ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected