Connect with us

News

వాషింగ్టన్ డీసీ వాసి ఈశ్వర్ రెడ్డి బండా కృషితో సొంత ఊరికి రోడ్డు మంజూరు

Published

on

తెలంగాణ రాష్ట్రం జానంపేట కు చెందిన ఈశ్వర్ రెడ్డి బండా ఇరవై ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. పుట్టిన ఊరు పై ఉన్న మక్కువతో రోడ్డు మంజూరు అయ్యేలా చొరవ తీసుకున్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తో తనకున్న అనుబంధంతో తాళ్లగడ్డ ప్రజల ఇబ్బందులు తొలగించేలా చర్చించారు.

ఇండియాకు వచ్చినపుడు, అలాగే ఈమధ్య మంత్రి అమెరికా పర్యటనకు వెళ్ళినపుడు ఈశ్వర్ రెడ్డి తన ఊరు రోడ్డు నిర్మాణంపై ప్రత్యేకంగా చర్చించారు. జానంపేట నుంచి తాళ్లగడ్డ వరకు రోడ్డు నిర్మాణం కోసం అనుమతులు మంజూరు చేశారు. ఎమ్మెల్యే ఆలా వేంకటేశ్వర రెడ్డి తో NRI ఈశ్వర్ రెడ్డి బండా ఫోన్లో ప్రత్యేకంగా మాట్లాడారు.

మంత్రికి, ఎమ్మెల్యే కి ఈశ్వర్ రెడ్డి బండా థాంక్స్ చెప్పారు. వీలైనంత త్వరగా రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. గతంలోనూ ఇక్కడ బ్రిడ్జి నిర్మాణo కోసం NRI ఈశ్వర్ రెడ్డి కృషి చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected