Connect with us

Festivals

వినాయకుని మట్టి ప్రతిమల తయారీ @ Eco Friendly Ganesha Workshop by Chicago Andhra Association & Mall of India

Published

on

Naperville, Chicago: చికాగో ఆంధ్ర సంఘం (CAA) మరియు మాల్ ఆఫ్ ఇండియా యాజమాన్యం సెప్టెంబరు 4 వ తేదీన, నిర్వహించిన Eco friendly Ganesha Workshop నేపర్విల్ మాల్ ఆఫ్ ఇండియా లో చాలా కోలాహలంగా జరిగింది. వినాయక చవితిని పురస్కరించుకొని రవి తోకల మరియు సత్య చింతకింది హాజరు అయిన చిన్నారులతో మట్టి వినాయకుడి ప్రతిమలు తయారు చేయించారు.

ఈ కార్యక్రమం లో 300 మందికి పైగా చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంస్థ 2024 అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి (Swetha Kothapalli) మరియు చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు (Srinivas Pedamallu) ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి , Mall of India యజమాని వినోజ్ గారి సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి 1000 మందికి పైగా చికాగో వాసులు విచ్చేసారు.

సంస్థ అభ్యున్నతిని ఎంతో ప్రోత్సహిస్తున్న స్పాన్సర్లు, Mall of India యజమాని వినోజ్, రవి తోకల, సత్య చింతకింది మరియు సంస్థ సభ్యులకు చికాగో ఆంధ్ర సంఘం (Chicago Andhra Association – CAA) వారు కృతజ్ఞతలు తెలిపారు.

దీప ప్రజ్వలన తో కార్యక్రమాన్ని మెదలు పెట్టి, చిన్నారుల చేత వినాయకుడి ప్రార్థన చెప్పించి వినాయక చవితి (Ganesh Chaturthi) పండుగ ప్రాముఖ్యత ను పరిచయం చేస్తూ రవి తోకల మరియు సత్య చింతకింది ఎంతో ఓపిగ్గా చిన్నారులకు మట్టి ప్రతిమ (Eco Friendly Ganesha) తయారీ విధానము ను తెలిపారు.

ఈ కార్యక్రమానికి చికాగో ఆంధ్ర సంఘం (Chicago Andhra Association) సభ్యులకు మరియు సభ్యులు కాని వారికి కూడా ఉచిత ప్రవేశం కల్పించారు. కార్యక్రమాన్ని రెండు సెషన్ల గా విభజించి 6 pm – 7:30 pm మరియు 7:30 pm- 9 pm నిర్వహించారు. లక్ష్మణ్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి ఫోటోగ్రఫీ సేవలనందించారు.

ఆశ్రిత్ కొత్తపల్లి వినాయకుడి గా స్ఫూర్తినివ్వడం ప్రతయేక ఆకర్షణ గా నిలిచింది. చిన్నారులు అంతా వినాయకుడితో ఫోటోలు తీయించుకున్నారు. సంస్థ స్పాన్సర్ అకేషన్స్ బై కృష్ణ (Occasions by Krishna) కృష్ణ జాస్తి గారు, తమిశ్ర కొంచాడ గారి నహకారంతో వేదికను అందంగా అలంకరించారు.

బోర్డు సభ్యులు సవితా మునగ, అనురాధ గంపాల, శ్రీకృష్ణ మతుకుమల్లి, శైలజ సప్ప, అనూష బెస్త, శ్రీ స్మిత నండూరి, తమిశ్ర కొంచాడ, అన్విత పంచాగ్నుల, పద్మారావు అప్పలనేని, ప్రభాకర్ మల్లంపల్లి, శ్రీనివాస్ పద్యాల, నరసింహారావు వీరపనేని, శ్రీనివాస్ పెదమల్లు, హేమంత్ తలపనేని, నరేశ్ చింతమాని, పూర్వ అధ్యక్షులు శ్రీ శైలేశ్ మద్ది, మాలతి దామరాజు, గౌరీ శంకర్ అద్దంకి, ట్రస్టీలు సుజాత అప్పలనేని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected